Share News

K. Rajagopal Reddy: 80-90 స్థానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది

ABN , First Publish Date - 2023-11-17T20:28:51+05:30 IST

భూమి ఆకాశము ఒకటైన బ్రహ్మ దేవుడి దిగివచ్చినా ఈఎన్నికల్లో సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagdish Reddy ) ని గెలవనివ్వద్దని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ( Komati Reddy Rajagopal Reddy ) అన్నారు.

K. Rajagopal Reddy:  80-90 స్థానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది

సూర్యాపేట: భూమి ఆకాశము ఒకటైన బ్రహ్మ దేవుడి దిగివచ్చినా ఈఎన్నికల్లో సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagdish Reddy ) ని గెలవనివ్వద్దని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ( Komati Reddy Rajagopal Reddy ) అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘గెలిచిన నేతలని బెదిరించి మరీ గులాబీ కండవాలు కప్పి పదేళ్లు అరాచకం సృష్టించారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ వస్తే రాష్ట్రంలో దుర్మార్గం మరింతగా పెరిగిపోతుంది. కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ నాయకులు కొట్టుకుపోవడం ఖాయం. 80-90 స్థానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

జగదీష్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలి: వేముల వీరేశం

తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారని కాంగ్రెస్ నేత వేముల వీరేశం (Vemula Viresham ) అన్నారు. సూర్యాపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట పౌరుషం చూపించాలి. మంత్రి జగదీష్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని వేముల వీరేశం పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-17T20:28:52+05:30 IST