Share News

Telangana Elections : కేసీఆర్‌ సర్కార్‌కు ఝలక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్!

ABN , First Publish Date - 2023-11-20T16:50:26+05:30 IST

Telangana Assembly Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Polls) మరికొన్నిరోజులే సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు...

Telangana Elections : కేసీఆర్‌ సర్కార్‌కు ఝలక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Polls) మరికొన్నిరోజులే సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే.. బీఆర్ఎస్ మాత్రం సరిగ్గా ఎన్నికల సమయంలో రైతులు, ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.


ఇదీ అసలు కథ..

ఈ క్రమంలో రైతుబందు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, రైతు రుణమాఫీలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కేసీఆర్ సర్కార్ సంప్రదించింది. అయితే.. ఈ విజ్ఞప్తులను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పెండింగ్ డీఏలు ఇప్పుడు ఎలా ఇస్తారు..? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది. దీంతో కేసీఆర్ సర్కార్‌కు ఈసీ ఝలక్ ఇచ్చినట్లయ్యింది. నిన్న, మొన్నటి వరకూ రైతుబందు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. రైతన్నలకు రైతుబందు ఇస్తామంటే.. కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారని బీఆర్ఎస్ పెద్దలు ఆరోపించారు. అంతేకాదు.. కాంగ్రెస్ అడుగడుగునా ఇలా అడ్డంకులు సృష్టిస్తోందని ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే రైతు బంధు ఆపాలని సైతం ఎవరి నుంచి తమకు ఫిర్యాదులు ఇప్పటివరకూ అందలేదని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా పై విధంగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈసీ ప్రకటనపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.

Updated Date - 2023-11-20T16:52:38+05:30 IST