CM KCR: బుద్దున్నోడు అలా మాట్లాడుతాడా?.. బండి సంజయ్‌పై కేసీఆర్ పరోక్ష విమర్శలు
ABN , First Publish Date - 2023-11-17T15:37:23+05:30 IST
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్ష విమర్శలు గుప్పించారు.
కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanajay )పై ముఖ్యమంత్రి కేసీఆర్ CM KCR) పరోక్ష విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. కేబుల్ బ్రిడ్జి మీద డాంబర్ కారితే కూలగొట్టాలని మాట్లాడుతారా అంటూ మండిపడ్డారు. ‘‘కేబుల్ మీద చిన్న గీత పడితే కూలిపోతదా. కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారు.. తలకాయ, బుద్ధి ఉందా ఆ వెధవకు.. తోక మీద ఈకలు పీకుతున్నారు. బుద్ది ఉన్నోడు అలా మాట్లాడుతారా. వాడు వీడు ఏదో మాట్లాడితే పట్టించుకోవద్దు. కరీంనగర్ ప్రజలు ఐదేళ్లుగా బాధ పడుతున్నారు. మత పిచ్చి తప్ప ఇక్కడి బీజేపీ నేతకు ఇంకేం రాదు. మసీదులు తవ్వినోడు సిపాయా. గుడులు, మసీదులు తవ్వడం మంచిదా. బీజేపీకి మత పిచ్చి తప్ప ఇంకేం రాదు. మోదీ మా తెలంగాణకు ఒక్క మెడికిల్ కాలేజీ ఇచ్చినవా. మాకు మేమే కాలేజీలు కట్టుకుంటున్నాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి