Liquor Shops: తెలంగాణలో ఏపీ కంపెనీ జోరు.. మద్యం దుకాణాలకు రూ.100 కోట్ల ఖర్చు

ABN , First Publish Date - 2023-08-26T13:06:26+05:30 IST

ఏపీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణలో మద్యం దుకాణాల కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టిందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ పరిశీలనలో బహిర్గతం అయ్యింది. విశాఖ ప్రాంతంలో స్థిరాస్థి వ్యాపారం చేస్తున్న సదరు సంస్థ తెలంగాణలో మద్యం వ్యాపారంలో అడుగుపెట్టేందుకు 5వేలకు పైగా టెండర్లు దాఖలు చేసింది. లక్కీ డ్రాలో సదరు రియల్ ఎస్టేట్ సంస్థకు 110 షాపుల లైసెన్సులు సొంతమైనట్లు సమాచారం.

Liquor Shops: తెలంగాణలో ఏపీ కంపెనీ జోరు.. మద్యం దుకాణాలకు రూ.100 కోట్ల ఖర్చు

తెలంగాణలో 2023-2025 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఇటీవల మద్యం దుకాణాల లైసెన్సులకు టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. దాఖలైన టెండర్ల నుంచి లక్కీ డ్రా నిర్వహించి మద్యం దుకాణాల లైసెన్సులను ప్రభుత్వ అధికారులు అప్పగించారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏపీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణ మద్యం టెండర్లలో అత్యధిక దరఖాస్తులు దాఖలు చేసి భారీ స్థాయిలో షాపులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణలో మద్యం దుకాణాల కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టిందని ఎక్సైజ్ శాఖ పరిశీలనలో బహిర్గతం అయ్యింది. విశాఖ ప్రాంతంలో స్థిరాస్థి వ్యాపారం చేస్తున్న సదరు సంస్థ తెలంగాణలో మద్యం వ్యాపారంలో అడుగుపెట్టేందుకు 5వేలకు పైగా టెండర్లు దాఖలు చేసింది. లక్కీ డ్రాలో సదరు రియల్ ఎస్టేట్ సంస్థకు 110 షాపుల లైసెన్సులు సొంతమైనట్లు సమాచారం అందుతోంది. తెలంగాణలో మద్యం వ్యాపారం తీరును లోతుగా పరిశీలించిన ఆ కంపెనీ హైదరాబాద్ శివారు ప్రాంతాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా శంషాబాద్, సరూర్ నగర్ జిల్లాల పరిధిలో మద్యం అమ్మకాలకు గిరాకీ ఎక్కువగా ఉందని గ్రహించింది. దీంతో ఆ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు భారీగా దరఖాస్తులను చేసింది.

ఇది కూడా చదవండి: TS Assembly Polls : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!

కాగా తెలంగాణ వ్యాప్తంగా 34 ఎక్సైజ్‌ జిల్లాల్లో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులను అధికారులు ఆహ్వానించారు. లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారు ఈ నెల 23లోపు వార్షిక లైసెన్స్‌ రుసుంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్యం షాపులకు టెండర్లు దాఖలు చేశారు. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు 1,31,490 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్‌నగర్‌, ఎక్సైజ్‌ జిల్లాల్లో 42,596 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. సరూర్ నగర్‌ ఎక్సైజ్ పరిధిలో 134 మద్యం షాపులకు 10,908 దరఖాస్తులు రాగా, శంషాబాద్‌లో 100 దుకాణాలకు 10,811 అప్లికేషన్లు వచ్చాయి. నల్గొండలో 155 దుకాణాలకు 7,058, ఖమ్మంలో 122 షాపులకు 7,027, మేడ్చల్‌లో 114 దుకాణాలకు 7,017 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు వివరించారు. కాగా లక్కీడ్రాలో ఎంపికైన వారికి డిసెంబర్‌ 1 నుంచి కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వనున్నారు.

Updated Date - 2023-08-26T13:06:26+05:30 IST