Heart Attack: ఇవెక్కడి గుండెపోట్లు బాబోయ్.. రాత్రి 10 గంటలకు ఒకరు.. అర్థరాత్రి 2 గంటలకు మరొకరు..

ABN , First Publish Date - 2023-02-28T10:40:05+05:30 IST

ఒకే ఊరిలో గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందిన విషాద వార్త(Sad news) అందరినీ కలచివేసింది.

Heart Attack: ఇవెక్కడి గుండెపోట్లు బాబోయ్.. రాత్రి 10 గంటలకు ఒకరు.. అర్థరాత్రి 2 గంటలకు మరొకరు..

ఆదిలాబాద్ (ఆంధ్రజ్యోతి): ఒకే ఊరిలో గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందిన విషాద వార్త అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలం చించాల గ్రామానికి చెందిన ఒరగంటి లక్ష్మణ్(34), కండెల రాఘవులు(42) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి ఒరగంటి లక్ష్మణ్ గ్రామంలోని బంధువుల ఇంట్లో విందుకు వెళ్ళాడు. రాత్రి 10 గంటలకు తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా.. ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో రోడ్డుపైనే కుప్పకూలి పోయాడు. అక్కడే ఉన్న స్థానికులు సీపీఆర్ (CPR) చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే లక్ష్మణ్ మృతి చెందాడు.

ఇదిలా రాత్రి రెండు గంటల సమయంలో ఉంటే అదే గ్రామానికి చెందిన కండెల రాఘవులుకు ఛాతి(Chest)లో నొప్పి రావడంతో కుటుంబీకులు వెంటనే భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలోనే రాఘవులుకు మరోసారి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. వీరిద్దరివీ నిరుపేద కుటుంబాలే. లక్ష్మణ్ కు భార్య కూతురు ఉండగా రాఘవులుకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రెండు కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

Updated Date - 2023-02-28T10:49:05+05:30 IST