Share News

Corona Virus: బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కొవిడ్ నిర్ధారణ

ABN , Publish Date - Dec 22 , 2023 | 01:19 PM

కరోనా మహమ్మారి (Corona) మరోసారి విజృంభిస్తోంది. గురువారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ‘నీలోఫర్’లో 14 నెలల శిశు బాలుడికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే బాలుడి బాలుడి ఆరోగ్యం స్థిరంగానే ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషా రాణి వెల్లడించారు.

Corona Virus: బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కొవిడ్ నిర్ధారణ

హైదరాబాద్: కరోనా మహమ్మారి (Corona) మరోసారి విజృంభిస్తోంది. గురువారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ‘నీలోఫర్’లో 14 నెలల శిశు బాలుడికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే బాలుడి బాలుడి ఆరోగ్యం స్థిరంగానే ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషా రాణి వెల్లడించారు. డిసెంబర్ 18న న్యూమోనియాతో చిన్నారిని హాస్పిటల్‌లో చేర్పించారని, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాయని ఆమె వివరించారు. అన్ని న్యూమోనియో కేసులకు కరోనా టెస్టులు చేస్తుంటామని, అదే విధంగా బాలుడికి కూడా నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయ్యిందని చెప్పారు. బుధవారం శాంపుల్స్‌ను టెస్టింగ్‌కు పంపించగా గురువారం నిర్ణారణ అయ్యిందని వివరించారు. అయితే బాలుడి తల్లిదండ్రుల్లో కరోనా లక్షణాలులేవని పేర్కొన్నారు.

భూపాలపల్లి మహిళకు కొవిడ్ నిర్ధారణ

భూపాలపల్లి జిల్లాకు చెందిన గ్యాదరి యాదమ్మ (62) అనే మహిళకు కోవిడ్ - 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ జెడ్ఎన్ 1 వేరియంట్ నిర్థారణ కోసం యాదమ్మ శాంపిల్స్ పుణేకు పంపామన్నారు. ఎంజీఎంలో 50 పడకలు సిద్ధం చేశామన్నారు. ఈ వేరియంట్ చాలా ప్రమాదకరమని తెలుస్తోందని చంద్రశేఖర్ అన్నారు. కోవిడ్ కిట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. డబ్ల్యూహెచ్ఓ సూచనల ప్రకారం అంతా అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ప్రజలు గ్రూపులుగా వెళ్ళవద్దని.. మాస్కులు తప్పకుండా వాడాలని చంద్రశేఖర్ సూచించారు.


కాగా కరోనా కొత్త వేరియెంట్ జేఎన్.1 దేశవ్యాప్తంగా ఆందోళనలు కలిగిస్తోంది. కేరళలో ఇప్పటికే ఒక కేసు నమోదవ్వడంతో జేఎన్.1 వ్యాప్తిపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వాతావరణంలో మార్పు కారణంగా ఫ్లూ, జ్వరం, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో జనాలు పెద్ద సంఖ్యలో హాస్పిటల్స్‌కు క్యూ కడుతున్నారు. దీంతో కరోనా కొత్త వేరియెంట్ జేఎన్.1 వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 01:26 PM