Reliance jio: రిలయన్స్ జియో నుంచి అదిరిపోయే 2 కొత్త ప్లాన్స్... రీఛార్జ్ చేసుకోవాలనుకునేవారికి ఈ వివరాలు తెలిస్తే...

ABN , First Publish Date - 2023-06-13T17:18:23+05:30 IST

జియో కొత్తగా ఆవిష్కరించిన ప్లాన్స్ రేట్లు రూ.269 మొదలుకొని రూ.789 మధ్య ఉన్నాయి. ఇక వ్యాలిడిటీ విషయానికి వస్తే నెలవారీ నుంచి మూడు నెలల కాలానికి రూపొందించినవి. ఈ జాబితాలోని రెండు ప్లాన్స్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ కాలింగ్, పొడిగింపు వ్యాలిడిటీ అడిషనల్ బెనిఫిట్స్ కోరుకునేవారి ప్రత్యేకంగా రూపొందించింది. రూ.739, రూ.789 విలువైన ప్లాన్స్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

Reliance jio: రిలయన్స్ జియో నుంచి అదిరిపోయే 2 కొత్త ప్లాన్స్... రీఛార్జ్ చేసుకోవాలనుకునేవారికి ఈ వివరాలు తెలిస్తే...

యూజర్లు కోరుకునే నూతన ప్లాన్స్‌ను పరిచయం చేయడంలో ఎప్పటికప్పుడు ముందుండే రిలయన్స్ జియో (Reliance jio) మరో రెండు నూతన ఆఫర్లను ఆవిష్కరించింది. అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్‌, ఉచితంగా జియోసావన్ (Jio saavn) సబ్‌స్ర్కిప్షన్‌తోపాటు మరెన్నో ప్రయోజనాలు అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటి?, ఈ ప్లాన్ రేటు, వ్యాలిడిటీ వంటి వివరాలను తెలుసుకుందాం...

జియో కొత్తగా ఆవిష్కరించిన ఈ ప్లాన్స్ రేట్లు రూ.269 మొదలుకొని రూ.789 మధ్య ఉన్నాయి. ఇక వ్యాలిడిటీ విషయానికి వస్తే నెలవారీ నుంచి మూడు నెలల కాలానికి రూపొందించినవి. ఈ జాబితాలోని రెండు ప్లాన్స్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ కాలింగ్, పొడిగింపు వ్యాలిడిటీ అడిషనల్ బెనిఫిట్స్ కోరుకునేవారి ప్రత్యేకంగా రూపొందించింది. రూ.739, రూ.789 విలువైన ప్లాన్స్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. వీటిల్లో 5జీ డేటా ప్రయోజనాలతోపాటు ఇతర ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ ప్లాన్స్‌ను ఎంచుకునే కస్టమర్లు జియోసావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. కాగా జియోసావన్‌‌లో కస్టమర్లు ఎలాంటి యాడ్స్ లేకుండానే సంగీతాన్ని ఆస్వాదించొచ్చు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్స్, ఆఫ్‌లైన్ మ్యూజిక్, జియోట్యూన్స్ ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఈ ప్లాన్లకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిద్దాం...

జియో 739 ప్లాన్ వివరాలు...

గతంలో అందించిన ప్లాన్స్ మాదిరిగానే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ప్యాక్‌లో యూజర్లు 168 జీబీల హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా వినియోగించుకోవచ్చు. వీటికితోడు జియోసావన్ ప్రో, జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్ వంటి జియో యాప్స్ బెనిఫిట్స్ ఉచితంగా లభించనున్నాయి. జియో5జీ నెట్‌వర్క్ ఏరియాలో ఉండే జియో యూజర్లు హైస్పీడ్ నెట్‌వర్క్‌ను పొందొచ్చు.

జియో సావన్ ప్రో సబ్‌స్ర్కిప్షన్‌తో జియో మరికొన్ని ఆఫర్స్‌ను పరిచయం చేసింది. ధరలు రూ.269, రూ.529, రూ.589గా ఉన్నాయి. ఈ ప్లాన్స్‌లో 5జీ యాక్సెస్‌తో అన్‌లిమిటెడ్ డేటా లభించనుంది. ఇక అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు యథావిథిగా పొందొచ్చు. జియో రూ.269 ప్లాన్‌లో వ్యాలిడిటీ 28 రోజలు కాగా రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఇక జియో రూ.529 ప్లాన్‌లో జియో యూజర్లు 56 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రోజుకు 1.5జీబీ డైలీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. చివరి ప్లాన్ అయిన జియో రూ.589 ప్లాన్‌లో వ్యాలిడిటీ 56 రోజులు, కాగా డైలీ 2జీబీ హైస్పీడ్ డేటా లభించనుంది.

Updated Date - 2023-06-13T17:18:23+05:30 IST