iPhone15: ఐఫోన్ 15 వివరాలు లీక్.. ఆసక్తికర విషయాలు వెల్లడి..

ABN , First Publish Date - 2023-01-23T19:23:05+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు (iPhones) ఉండే క్రేజ్ వేరే లెవల్. ఇటివలే మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14 నుంచి గతంలో విడుదలైన ఐఫోన్12, 13, ఇతర ఫోన్ల విషయంలో ఈ విషయం రుజువైంది.

iPhone15: ఐఫోన్ 15 వివరాలు లీక్.. ఆసక్తికర విషయాలు వెల్లడి..

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు (iPhones) ఉండే క్రేజ్ వేరే లెవల్. ఇటివలే మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14 నుంచి గతంలో విడుదలైన ఐఫోన్12, 13, ఇతర ఫోన్ల విషయంలో ఈ విషయం రుజువైంది. ఎనలేని ఈ పాపులారిటీ కారణంగానే ఫోన్లకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ఐఫోన్ ప్రియులు (iPhone lovers) తెగ ఆసక్తి కనబరుస్తుంటారు. అలాంటి ఔత్సాహికులకు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఐఫోన్ 15 సిరీస్ (iphone 15 series) ఫోన్లకు సంబంధించిన సమాచారం లీకైంది. లీకేజీ సంకేతాలను బట్టి చూస్తే ఐఫోన్ 14 కంటే విభిన్నంగా ఉండడం ఖాయమనిపిస్తోంది. చెప్పుకోదగ్గ మార్పులతో ఐఫోన్ 15ను మార్కెట్లోకి తీసుకురావడం ఖచ్చితమనిపిస్తోంది.

లీకేజీ వివరాల ప్రకారం.. ఐఫోన్ 15 (iphone 15) మోడల్ ఫోన్ల డిస్‌ప్లే సైజు ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల సైజులో ఉంది. ఐఫోన్ 15 ప్రో ఫోన్ కర్వ్‌డ్ ఎడ్జ్‌తో (curved edges) రానున్నట్టు తెలుస్తోంది. అయితే డిస్‌ప్లే ఫ్లాట్‌గా ఉండనుంది. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ మాదిరిగా ఉండొచ్చని లీక్‌స్టర్ ‘శ్రింపుయాపిల్‌ప్రో’ (ShrimpApplePro) ట్విటర్ పేజీ వెల్లడించింది. వరుస ట్వీట్ల ద్వారా పలు వివరాలను వెల్లడించింది. ఐఫోన్15 మార్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఐఫోన్ 15 చూడడానికి ఆండ్రాయిడ్ కంటే ఎక్కువంటూ శ్రింపుయాపిల్‌ప్రో పేజీ పేర్కొంది. మరోవైపు స్టాండర్డ్ ఐఫోన్ 15 కూడా కర్వ్‌డ్ ఎడ్జ్‌తోపాటు డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో రానున్నాయని తెలిపింది. అయితే ఫ్రంట్-ఫేసింగ్ సెల్ఫీ కెమెరా విషయంలో పెద్ద మార్పేమీ ఉండకపోవచ్చునని పేర్కొంది. దీనినిబట్టి అప్‌గ్రేట్ ఏమీ ఉండకపోవచ్చని సమాచారం.

ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లకు సంబంధించి గతంలోనూ పలు లీకేజీలు ఉన్నాయి. చాలా సమాచారం వచ్చింది. అయితే అవన్నీ ఊహాగానాలేననే వాదనలున్నాయి. మరి తాజా లీకేజీలు ఎంతవరకు నిజమవుతాయో వేచిచూడాలి.

Updated Date - 2023-01-23T19:23:11+05:30 IST