iPhone 15: ఐఫోన్ 15లో భారీ మార్పులు.. ఈ అప్‌గ్రేడ్స్ గురించి తెలిస్తే అభిమానులు పండుగ చేసుకుంటారు!

ABN , First Publish Date - 2023-02-28T20:05:32+05:30 IST

గతేడాది విడుదలైన ఐఫోన్ 14(iPhone 14) అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఐఫోన్ 13(iPhone 13)తో పోలిస్తే డిజైన్, ఫీచర్ల విషయంలో పెద్దగా మార్పులు లేకుండానే విడుదల

iPhone 15: ఐఫోన్ 15లో భారీ మార్పులు.. ఈ అప్‌గ్రేడ్స్ గురించి తెలిస్తే అభిమానులు పండుగ చేసుకుంటారు!

న్యూఢిల్లీ: ఐఫోన్ 15(iPhone 15)కి సంబంధించి మేజర్ డిజైన్ అప్‌గ్రేడ్ లీకైంది. 2017లో విడుదలైన ఐఫోన్ 10(iPhone X)తో పోలిస్తే ఇది మరింత పెద్దగా ఉండే అవకాశం ఉందని లీకైన వివరాలను బట్టి తెలుస్తోంది. గతేడాది విడుదలైన ఐఫోన్ 14(iPhone 14) అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఐఫోన్ 13(iPhone 13)తో పోలిస్తే డిజైన్, ఫీచర్ల విషయంలో పెద్దగా మార్పులు లేకుండానే విడుదల చేసి నిరుత్సాహ పరిచింది. సోషల్ మీడియాలోనూ దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.

హైడెన్ ఫేస్ ఐడీ సెన్సార్

ప్రపంచవ్యాప్తంగా కురిసిన విమర్శలతో అప్రమత్తమైన యాపిల్ ఈ ఏడాది విడుదల చేసే ఫోన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. మేజర్ అప్‌డేట్స్‌తో వీటిని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. రాబోతున్న ఐఫోన్ 15(iPhone 15) విషయానికి వస్తే.. ముందు భాగంలో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది. గతేడాది ప్రొ మోడల్స్‌లో చూసిన డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉండే అవకాశం ఉంది. స్టాండర్డ్ మోడల్‌‌.. హైడెన్ ఫేస్ ఐడీ సెన్సార్‌తో సింగిల్ పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తోంది.

లైటింగ్ పోర్ట్‌కు స్వస్తి

ఐఫోన్ 15(iPhone)లో మరో పెద్ద అప్‌గ్రేట్ ఏంటంటే.. లైటింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్‌బీ సి పోర్టును ఉపయోగించారు. ఇకపై అన్ని డివైజ్‌లలోనూ యూఎస్‌బీ సి పోర్టును ఉపయోగించాలన్న యూరోపియన్ చట్టం కారణంగా లైటంగ్ పోర్టుకు స్వస్తి పలికి దీనిని తీసుకొస్తోంది. లైటింగ్ పోర్టు లేకుండా వస్తున్న తొలి ఐఫోన్లు ఇవే అవుతాయి. దీనివల్ల ఒకే ఒక చార్జర్ తీసుకెళ్తే సరిపోతుంది.

అయినా నో యూజ్!

ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు కూడా యూఎస్‌బీ సి పోర్టుతోనే వస్తున్నాయి. కాబట్టి యూజర్లకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించేదే. అయితే, యూఎస్‌బీ సి పోర్టు ఉంది కదా అని ఏ చార్జర్‌తో పడితే ఆ చార్జర్ ఉపయోగించకుండా యాపిల్ పరిమితి విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారీ కెమెరా

కెమెరా సెటప్ డిజైన్‌లో మాత్రం మార్పు లేనట్టు తెలుస్తోంది. అయితే, ఐఫోన్ 15లో వెనకవైపు 48 ఎంపీ కెమెరా ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇది నిజంగా పెద్ద అప్‌డేటే. ఎందుకంటే పాత ఐఫోన్లలో 12 మెగాపిక్సల్ సెన్సార్లను మాత్రమే ఉపయోగించింది. అలాగే, గత స్టాండర్డ్ వెర్షన్లతో పోలిస్తే డిస్‌ప్లే మరింత పెదగ్గా ఉంటుంది. అంటే ఐఫోన్ 15 6.2 అంగుళాల డిస్‌ప్లేతో వస్తున్నట్టు లీకులను బట్టి తెలుస్తోంది.

Updated Date - 2023-02-28T20:46:43+05:30 IST