TikTok: టిక్‌టాక్‌కు వరుస తలనొప్పులు.. ఇప్పుడు న్యూజిలాండ్!

ABN , First Publish Date - 2023-03-19T17:46:44+05:30 IST

వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌(TikTok)కు కష్టాలు ఒకదాని తర్వాత ఒకటిగా

TikTok: టిక్‌టాక్‌కు వరుస తలనొప్పులు..  ఇప్పుడు న్యూజిలాండ్!

వెల్లింగ్టన్: వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌(TikTok)కు కష్టాలు ఒకదాని తర్వాత ఒకటిగా చుట్టుముడుతున్నాయి. తమ రహస్యాలు చైనా(China)కు చేరుతున్నాయన్న అనుమానంతో ప్రభుత్వ ఫోన్లలో టిక్‌టాక్‌ను నిషేధిస్తూ బ్రిటన్(Britian) నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దాని సరసన న్యూజిలాండ్(New Zealand) కూడా చేరింది. భద్రతా పరమైన భయాలతో ప్రభుత్వ పరికరాల్లో టిక్‌టాక్‌‌ను న్యూజిలాండ్ నిషేధించినట్టు తెలుస్తోంది. చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వ ఫోన్లలో నిషేధిస్తున్నట్టు గురువారం ప్రకటించిన యూకే(UK).. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. యూకే పేర్కొన్న లాంటి కారణాలతోనే భారత్ సహా అమెరికా, కెనడా వంటి దేశాలు గతంలోనే టిక్‌టాక్‌ను నిషేధించాయి.

ప్రభుత్వ పరికరాల్లోని అత్యంత సున్నితమైన డేటా, యూజర్ కంటెంట్, జియో లొకేషన్ వంటి వాటిని సోషల్ మీడియా యాప్స్ పెద్దమొత్తంలో సేకరించి నిల్వ చేసుకుంటున్నట్టు డచీ ఆఫ్ లాంకాస్టర్ చాన్స్‌లర్ ఒలివర్ డౌడెన్ పేర్కొన్నారు. కాబట్టే ముందుజాగ్రత్తగా చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూకే పార్లమెంటులో ఆయన తెలిపారు.

చైనా కంపెనీ బైడ్ డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్ వ్యవహారాలు కరోనా తర్వాత అనుమానాస్పదంగా మారాయి. దీంతో పలు దేశాలు దానిపై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బ్రిటన్ కూడా దానిని నిషేధించడంతో పాశ్చాత్య దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు వాడుతున్న ఫోన్లలో సున్నితమైన డేటాను టిక్‌టాక్ సేకరించి చైనా ప్రభుత్వంతో పంచుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం దానిని నిషేధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-03-19T17:46:44+05:30 IST