Third T20 : మార్పులతో బరిలోకి..

ABN , First Publish Date - 2023-08-23T02:53:45+05:30 IST

ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఫలితమేంటో ఇప్పటికే తేలిపోయింది. ఇక మిగిలిన ఆఖరి మ్యాచ్‌ను సైతం టీమిండియా తమ ఖాతాలో వేసుకుంటే క్లీన్‌స్వీ్‌ప ఖాయమే. బుధవారం జరిగే మూడో టీ20లో బుమ్రా సేన అదే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

Third T20 : మార్పులతో  బరిలోకి..

జితేశ్‌, అవేశ్‌లకు చాన్స్‌!

క్లీన్‌స్వీప్‌పై భారత్‌ దృష్టి

ఐర్లాండ్‌తో మూడో టీ20 నేడు

డబ్లిన్‌: ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌(Three T20 series with Ireland) ఫలితమేంటో ఇప్పటికే తేలిపోయింది. ఇక మిగిలిన ఆఖరి మ్యాచ్‌ను సైతం టీమిండియా(Team India) తమ ఖాతాలో వేసుకుంటే క్లీన్‌స్వీ్‌ప ఖాయమే. బుధవారం జరిగే మూడో టీ20లో బుమ్రా సేన అదే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు నేటి మ్యాచ్‌లో మాత్రం రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షించనుంది. ఆసియాగేమ్స్‌(Asia Games)లో దాదాపు ఇదే జట్టు ఆడే అవకాశం ఉంది. కాబట్టి మిగతా ఆటగాళ్లకు కూడా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించాలనేది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచన. వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ, పేసర్‌ అవేశ్‌ ఖాన్‌, స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌లకు ఇప్పటిదాకా అవకాశం లభించలేదు. కరీబియన్‌ పర్యటనలో అవేశ్‌ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లోనూ పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌కు కూడా పక్కనబెడితే ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండానే ఆసియా గేమ్స్‌కు వెళ్లినట్టవుతుంది. అటు ఆతిథ్య ఐర్లాండ్‌ మాత్రం ఓదార్పు విజయం కోసం ఎదురుచూస్త్తోంది. వారి జట్టులో భారీ హిట్లర్లున్నా అదృష్టం కలిసి రావడం లేదు.

అన్ని విభాగాల్లో పటిష్ఠంగా..:

ఐర్లాండ్‌తో సిరీస్‌ చాలా ప్రశ్నలకు జవాబు చెప్పినట్టయ్యింది. గాయాల నుంచి కోలుకున్న కెప్టెన్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌లు తమ ఫిట్‌నె్‌సతో పాటు వికెట్ల వేటను సాగించిన తీరు ఆకట్టుకుంది. రుతురాజ్‌, సంజూ శాంసన్‌ సత్తా నిరూపించుకోగా.. రింకూ సింగ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఇప్పుడిక ఈ నామమాత్రమైన మ్యాచ్‌లో రిజర్వ్‌ బెంచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. ఐపీఎల్‌లో అదరగొట్టిన జితేశ్‌ శర్మకు అవకాశమిచ్చి లోయర్‌ మిడిలార్డర్‌ను పటిష్ఠం చేయాలనుకుంటోంది. అదే జరిగితే శాంసన్‌ను తప్పించవచ్చు. అలాగే సుందర్‌కు విశ్రాంతినిచ్చి షాబాజ్‌ను పరీక్షించే చాన్స్‌ ఉంది. పేసర్‌ అవేశ్‌ ఖాన్‌కు తగిన ప్రాక్టీస్‌ లభించాలని జట్టు భావిస్తుండగా.. ఒకవేళ తనకు చోటిస్తే అర్ష్‌దీ్‌పను పక్కనబెట్టాల్సి ఉంటుంది. మరోవైపు కెప్టెన్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ విశ్రాంతి తీసుకుంటారా? లేక ఆసియాకప్‌ ముందు మరింత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం బరిలోకి దిగుతారా? అనేది వేచిచూడాల్సిందే.

బ్యాటర్లు రాణిస్తేనే..:

ఆఖరి మ్యాచ్‌లో భారత్‌కు పోటీనివ్వాలంటే ఐర్లాండ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో శక్తికి మించి రాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాటర్ల వైఫల్యంతో తొలి మ్యాచ్‌లో 59/6 స్కోరుతో కష్టాల్లో పడగా.. రెండో మ్యాచ్‌లో బల్బిర్నీ ఒక్కడే రాణించాడు. బుమ్రా యార్కర్లు, ప్రసిద్ధ్‌ షార్ట్‌పిచ్‌ బంతులు, బిష్ణోయ్‌ స్పిన్‌ను టాప్‌-4 బ్యాటర్లు ఎదుర్కోవాల్సివుంది. అలాగే డెత్‌ ఓవర్లలోనూ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకోవడం ఆందోళనపరిచే విషయం. తమ లోపాలను సరిదిద్దుకుని దీటుగా బరిలోకి దిగితేనే.. భారత్‌పై పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కనీసం పదకొండో ప్రయత్నంలోనైనా విజయం దక్కుతుంది.

పిచ్‌, వాతావరణం

ఈ మ్యాచ్‌లోనూ పిచ్‌ బ్యాటర్లకు అనుకూలించవచ్చు. 175 సవాల్‌ విసిరే స్కోరు కానుంది. అయితే ఆకాశం మేఘావృతంగా ఉండనుండడంతో చిరుజల్లులకు ఆస్కారం ఉంది.

జట్లు (అంచనా)

భారత్‌:

జైస్వాల్‌, రుతురాజ్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, శాంసన్‌/జితేశ్‌, దూబే, సుందర్‌/షాబాజ్‌, అర్ష్‌దీ్‌ప/అవేశ్‌, బిష్ణోయ్‌, బుమ్రా (కెప్టెన్‌), ప్రసిద్ధ్‌ క్రిష్ణ.

ఐర్లాండ్‌:

స్టిర్లింగ్‌, బల్బిర్నీ, టక్కర్‌, టెక్టర్‌, కాంఫర్‌, డాక్‌రెల్‌, అడెయిర్‌, మెక్‌కార్తి, యంగ్‌, లిటిల్‌, వైట్‌/వోర్‌కామ్‌.

Updated Date - 2023-08-23T04:02:05+05:30 IST