Ind vs NZ: ఇండోర్ వన్డేలో భారత్ భారీ స్కోరు.. న్యూజిలాండ్‌కు అంత ఈజీ కాదు!

ABN , First Publish Date - 2023-01-24T17:36:09+05:30 IST

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ చెలరేగి ఆడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టుకు టీమిండియా బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు.

Ind vs NZ: ఇండోర్ వన్డేలో భారత్ భారీ స్కోరు.. న్యూజిలాండ్‌కు అంత ఈజీ కాదు!

ఇండోర్: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ చెలరేగి ఆడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టుకు టీమిండియా బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma (c), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఇద్దరి శతకాలకుతోడు చివరిలో హార్ధిక పాండ్యా 54 పరుగులు జోడించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 385 పరుగులు నమోదు చేసింది. దీంతో ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు 386 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే గత రెండు వన్డేల్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు. దీంతో ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయారు. పేలవ ప్రదర్శణ దృష్ట్యా 386 పరుగుల లక్ష్యాన్ని చేధించడం కష్టమనే చెప్పాలి.

భారత్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ గిల్ మరోసారి చక్కటి ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు ఏకంగా 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 101 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక శుభ్‌మన్ గిల్ 72 బంతుల్లోనే 4 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో సెంచరీ బాదేశాడు. అయితే సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత ఇద్దరూ వెంటవెంటనే ఔటయ్యారు. జట్టు స్కోరు 212 పరుగుల వద్ద మిచెల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (101) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక వ్యక్తిగత స్కోరు 112 పరుగుల వద్ద టిక్నర్ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 36 పరుగులు వద్ద ఔటయ్యి కాస్త ఫర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 17 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే చివరిలో హార్ధిక పాండ్యా(54), శార్ధూల్ ఠాకూర్ (25) చెలరేగి ఆడి జట్టు స్కోరు వేగాన్ని పెంచారు. వీరిద్దరూ ఔటయ్యాక చివరి రెండు ఓవర్లలో తక్కువ పరుగులే వచ్చాయి. వాషింగ్టన్ సుందర్(9), కుల్దీప్ యాదవ్(2,రనౌట్), ఉమ్రాన్ మాలిక్ (2 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ, బ్లయిర్ టిక్నర్ చెరో 3 వికెట్లు తీయగా.. మిచెల్ బ్రేస్‌వెల్ 1 వికెట్ తీశాడు. మిగతా 2 వికెట్ల రనౌట్ రూపంలో దక్కాయి. కివీస్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్ మినహా మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

Updated Date - 2023-01-24T17:45:56+05:30 IST