Sania Mirza: రాయల్ ఛాలెంజర్స్ మహిళా జట్టు మెంటార్‌గా సానియా

ABN , First Publish Date - 2023-02-15T11:57:55+05:30 IST

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టులో మెంటార్‌గా...

Sania Mirza: రాయల్ ఛాలెంజర్స్ మహిళా జట్టు మెంటార్‌గా సానియా
Sania Mirza rcb Women Team Mentor

బెంగళూరు : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టులో మెంటార్‌గా చేరారు.(Sania Mirza)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) (RCB) మహిళా జట్టు టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జాను రాబోయే సీజన్ కోసం టీమ్ మెంటార్ గా(Women Team as Mentor) నియమించింది.సానియా మీర్జా టెన్నిస్ కోర్టులకు దూరంగా ప్రత్యేక పాత్ర పోషించనుంది.గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో తన చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో సానియామీర్జా ఆడారు. ఆరు గ్రాండ్‌స్లామ్‌ల విజేత సానియా మీర్జా ఆర్సీబీ ప్లే బోల్డ్ ఫిలాసఫీకి సరిగ్గా సరిపోతుందని క్రీడాభిమానులు వ్యాఖ్యానించారు.

సానియా మీర్జా ఆరు గ్రాండ్ స్లామ్‌లు, 43 డబ్ల్యూటీఏ టైటిల్స్‌ను 20 ఏళ్ల కెరీర్‌లో సాధించింది.అసంఖ్యాక మహిళలకు ప్రముఖ రోల్ మోడల్‌లలో ఒకరిగా ఉన్న సానియా ఆర్సీబీ మహిళా జట్టును ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.‘‘ఆర్‌సిబి మహిళా జట్టు మెంటార్‌గా సానియా మీర్జాను స్వాగతించడం మాకు సంతోషంగా, గౌరవంగా ఉంది. ఆమె కెరీర్‌లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె చేసిన కృషి, దృఢ సంకల్పంతో విజయాలు సాధించిన పరిపూర్ణమైన రోల్ మోడల్’’ అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ వి మీనన్ చెప్పారు.

ఇది కూడా చదవండి : Delhi: ఢిల్లీలో మరో శ్రద్ధా వాకర్ తరహా దారుణ హత్య

‘‘నేను ఆర్సీబీ మహిళా జట్టులో మెంటార్‌గా చేరడం ఆనందంగా ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో భారత మహిళల క్రికెట్ మార్పును చూసింది, ఈ విప్లవాత్మక పిచ్‌లో భాగం కావాలని నేను ఎదురు చూస్తున్నాను’’ అని సానియామీర్జా వ్యాఖ్యానించారు. సానియామీర్జా పద్మభూషణ్, అర్జునఅవార్డు, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు పొందారు.

Updated Date - 2023-02-15T12:09:31+05:30 IST