Delhi: ఢిల్లీలో మరో శ్రద్ధా వాకర్ తరహా దారుణ హత్య

ABN , First Publish Date - 2023-02-15T09:15:24+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో శ్రద్ధా వాకర్ తరహా దారుణ హత్య జరిగింది....

Delhi: ఢిల్లీలో మరో శ్రద్ధా వాకర్ తరహా దారుణ హత్య
Sahil Gahlot along with his deceased Nikki Yadav

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో శ్రద్ధా వాకర్ తరహా దారుణ హత్య జరిగింది.(Another Shraddha Walker-like gruesome murder)నిందితుడు సాహిల్ గహ్లోట్ తన సహజీవన భాగస్వామిని గొంతు కోసి హత్య చేసి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పడేసిన కొన్ని గంటల తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్న ఘటన తాజాగా ఢిల్లీలో (Delhi) వెలుగుచూసింది.(Sahil Gahlot, Nikki Yadav)సాహిల్ గహ్లోట్ అనే నిందితుడు తన సహజీవన భాగస్వామి నిక్కీ యాదవ్‌ను గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పడేసిన కొన్ని గంటల తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి : Valentines Day : ప్రేమికుల దినోత్సవం రోజు విషాదం...పాలోలెం బీచ్ కెళ్లిన దంపతులు ఏమయ్యారంటే...

ప్రాథమిక విచారణ ప్రకారం 2018వ సంవత్సరంలో ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్‌లో బాధితురాలు నిక్కీ యాదవ్‌ను కలిశానని 24 ఏళ్ల నిందితుడు సాహిల్ గహ్లోట్ ఢిల్లీ పోలీసులకు చెప్పాడు. కొంతకాలం తర్వాత వారు సహజీవనం (Living together) చేశారు. తన కుటుంబసభ్యులు మరో మహిళను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చి ఫిబ్రవరి 9, 10తేదీల్లో నిశ్చితార్థం, వివాహం చేయాలని నిర్ణయించారని నిందితుడు సాహిల్ చెప్పాడు. వేరే అమ్మాయితో తన వివాహం గురించి రహస్యంగా ఉంచి సాహిల్ నిక్కీ యాదవ్ తో గొడవపడి కారులో ఉంచి డేటా కేబుల్ తో ఉరి వేసి చంపాడు.

ఇది కూడా చదవండి : Karnataka: కర్ణాటక బీజేపీ చీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ఆపై సాహిల్ నిక్కీ మృతదేహాన్ని దాబాలోని ఫ్రిజ్ లో దాచి, మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఢిల్లీ పోలీసులు చెప్పారు.నిందితుడు మిత్రాన్‌ గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, అతడిని అదుపులోకి తీసుకున్నామని అదనపు డీసీపీ విక్రంసింగ్ చెప్పారు. బాధితురాలు నిక్కీయాదవ్ హర్యానాలోని ఝజ్జర్ నివాసి.దాబాలోని ఫ్రిజ్ లో ఉన్న నిక్కీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు వివరించారు.

Updated Date - 2023-02-15T09:24:42+05:30 IST