Share News

Olympics: ఇక నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్.. మరో నాలుగు క్రీడలు కూడా..

ABN , First Publish Date - 2023-10-16T16:06:24+05:30 IST

ఇక నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కూడా అభిమానులను అలరించనుంది. ఈ మేరకు ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ను నిర్వహించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సోమవారం ఆమెదం తెలిపింది.

Olympics: ఇక నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్.. మరో నాలుగు క్రీడలు కూడా..

ఇక నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కూడా అభిమానులను అలరించనుంది. ఈ మేరకు ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ను నిర్వహించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సోమవారం ఆమెదం తెలిపింది. క్రికెట్‌తోపాటు బేస్ బాల్- సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లక్రాస్(సిక్సస్), స్వ్కాష్‌ క్రీడలకు కూడా ఐఓసీ ఆమోదం లభించింది. లాస్ ఏంజెల్స్‌లో జరిగే 2028 ఒలింపిక్స్‌లో ఈ ఐదు క్రీడలు భాగం కానున్నాయి. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఈ ఐదు క్రీడలను నిర్వహించడానికి ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు శుక్రవారమే ఆమోదం తెలిపింది. క్రికెట్‌తోపాటు మిగతా నాలుగు క్రీడలను ప్రవేశపెట్టే అంశంపై సోమవారం ముంబైలో ఓటింగ్ నిర్వహించారు. 90 మంది ఐఓసీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఈ ఐదు క్రీడలను ఒలింపిక్స్‌లో చేర్చడానికి ఆమెదం లభించిందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ వెల్లడించారు. కాగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం మన దేశంలో క్రికెట్ ప్రపంచకప్ జరుగుతున్న సమయంలోనే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ఆమోదం కూడా లభించడం విశేషం. దీంతో 1900 సంవత్సరం తర్వాత మళ్లీ ఒలిపింక్స్‌లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. 1900వ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో బ్రిటన్ బంగారు పతకం, ఫ్రాన్స్ రజత పతకం గెలుచుకున్నాయి. ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడం వలన ఐఓసీ కోసం టీమిండియా ప్రసార హక్కుల విలువ 100 మిలియన్ డాలర్లకు పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-10-16T16:06:24+05:30 IST