Share News

India vs Australia: రెండో టీ20 మ్యాచ్ పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..?

ABN , First Publish Date - 2023-11-26T09:28:30+05:30 IST

2nd T20 Match Pitch Report: భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో టీ20 మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. కేరళలోని తిరువనంతపురం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి టీ20 గెలిచిన ఊపులో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అధిక్యాన్ని మరింత పెంచుకోవాలని పట్టుదలగా ఉంది.

India vs Australia: రెండో టీ20 మ్యాచ్ పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..?

తిరువనంతపురం: భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో టీ20 మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. కేరళలోని తిరువనంతపురం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి టీ20 గెలిచిన ఊపులో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అధిక్యాన్ని మరింత పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. విశాఖ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో 200కు పైగా పరుగులు సాధించినప్పటికీ బౌలర్ల వైఫల్యంతో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఆస్ట్రేలియా ఈ సారి ఆ తప్పును పునరావృతం కానివ్వకూడదని భావిస్తోంది. నిజానికి గత మ్యాచ్‌లో రెండు జట్లలోని బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో రెండు జట్ల బౌలర్లు గాఢిన పడాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సత్తా చాటారు. రెండో టీ20 మ్యాచ్‌లో మిగతా బ్యాటర్లు కూడా రాణించాల్సిన అవసరం ఉంది. అయితే మ్యాచ్ జరిగే తిరువనంతపురంలో శనివారం అంతా వర్షం పడింది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ జరిగే సమయంలో కూడా వర్షం పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా నెలకొంది.


తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం పిచ్ రిపోర్టు విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో మాదిరిగా ఇక్కడ భారీ స్కోర్లు వచ్చే అవకాశాలు లేకపోయినప్పటికి ఇదొక మంచి స్పోర్టింగ్ వికెట్. బాల్ టర్న్ అవుతున్న సమయంలో కొత్త బంతికి మద్దతు లభిస్తుంది. టాస్ కీలకమయ్యే అవకాశాలున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ప్రారంభంలో జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొత్త బంతిలో మూవ్‌మెంట్ ఉండనుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే వారు కూడా ఆరంభంలో స్వింగ్‌ను ఎదుర్కొవలసి ఉంటుంది. ఇక్కడ ఇప్పటివరకు 3 టీ20 మ్యాచ్‌లు జరగగా మొదటి ఇన్నింగ్స్ అత్యధిక స్కోర్ 170 పరుగులుగా ఉంది. ఇక్కడ జరిగిన చివరి ట20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు 9 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది. 3 మ్యాచ్‌ల్లోనూ స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. వరల్డ్‌కప్ వామప్ మ్యాచ్‌లోనూ నెదర్లాండ్స్‌పై స్టార్క్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. అయితే ఈ ఏడది ఆరంభంలో ఇక్కడ శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 390 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ ఆ తర్వాత లక్ష్య చేధనలో శ్రీలంక 73 పరుగులకే ఆలౌట్ అయింది.

జట్లు (అంచనా)

భారత్‌: రుతురాజ్‌, యశస్వీ, ఇషాన్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, అక్షర్‌, రవి బిష్ణోయ్‌, ప్రసిద్ధ్‌, ముకేశ్‌.

ఆస్ట్రేలియా: షార్ట్‌, స్మిత్‌, ఇన్‌గ్లి్‌స, హార్డీ, స్టొయినిస్‌, డేవిడ్‌, మాథ్యూ వేడ్‌ (కెప్టెన్‌), అబాట్‌, ఎల్లిస్‌, బెహ్రెన్‌డార్ఫ్‌, తన్వీర్‌ సంఘా.

Updated Date - 2023-11-26T10:45:48+05:30 IST