IND vs IRE 3rd T20I: రింకూ సింగ్, సంజూ శాంసన్‌తో సహా ఐదుగురు టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న మైలు స్టోన్స్ ఇవే!

ABN , First Publish Date - 2023-08-23T13:52:54+05:30 IST

భారత్, ఐర్లాండ్ మధ్య నేడు చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న భారత్.. నేటి మ్యాచ్‌లోనూ గెలిచి 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.

IND vs IRE 3rd T20I: రింకూ సింగ్, సంజూ శాంసన్‌తో సహా ఐదుగురు టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న మైలు స్టోన్స్ ఇవే!

డబ్లిన్: భారత్, ఐర్లాండ్ మధ్య నేడు చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న భారత్.. నేటి మ్యాచ్‌లోనూ గెలిచి 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అటు అతిథ్య ఐర్లాండ్ మాత్రం చివరిదైన మూడో మ్యాచ్‌లోనైనా గెలిచి సొంత గడ్డపై పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు రింకూ సింగ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, జితేష్ శర్మ, షాబాజ్ అహ్మద్ పలు రికార్డులకు చేరువలో ఉన్నారు.

9- యువ బ్యాటర్ రింకూ సింగ్ మరొక 9 ఫోర్లు కొడితే అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 150 ఫోర్లను పూర్తి చేసుకుంటాడు. అలాగే ఫీల్డర్‌గా మరో రెండు క్యాచ్‌లు అందుకుంటే అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 50 క్యాచ్‌లను చేరుకుంటాడు.

9- స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మరో 9 ఫోర్లు బాదితే అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 500 ఫోర్లను పూర్తి చేసుకుంటాడు.

65- యువ బ్యాటర్ శివమ్ దూబే మరో 65 పరుగులు చేస్తే అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 2 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.

5- యువ బ్యాటర్ జితేష్ శర్మ మరో 5 సిక్సులు కొడితే అన్ని రకాల టీ20ల్లో 100 సిక్సులను చేరుకుంటాడు.

3-లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ మరో 3 వికెట్లు తీస్తే అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.

Updated Date - 2023-08-23T13:58:13+05:30 IST