IND vs AUS ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. రెండు మార్పులు చేసిన స్మిత్

ABN , First Publish Date - 2023-03-19T13:27:10+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని సాగర నగరం విశాఖలో జరుగుతున్న టీమిండియా, ఆస్ట్రేలియా రెండో వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. టీమిండియా తొలుత..

IND vs AUS ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. రెండు మార్పులు చేసిన స్మిత్

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లోని సాగర నగరం విశాఖలో జరుగుతున్న టీమిండియా, ఆస్ట్రేలియా రెండో వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఆస్ట్రేలియా టీంలో రెండు మార్పులు చేసినట్లు కెప్టెన్ స్మిత్ చెప్పాడు. మ్యాక్స్‌వెల్ బదులుగా ఎల్లిస్, జోష్ ఇంగ్లిస్ బదులు కేరీ ఆడనున్నట్లు స్మిత్ తెలిపాడు. ఇక.. టీమిండియాలో కూడా రెండు మార్పులు జరిగాయి. ఇషాన్ ఇవాళ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ విశాఖ వన్డేలో దుమ్మురేపనున్నాడు. శార్దూల్ బదులుగా అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని పిచ్‌ (వికెట్‌)పై 300కు పైగా స్కోరు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన వన్డే మ్యాచ్‌లను పరిశీలిస్తే...2019 డిసెంబరు 18న వెస్టీండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 387/5 స్కోరు చేసి రికార్డు నెలకొల్పింది. అత్యధిక వ్యక్తిగత స్కోరు (159) రికార్డు కూడా భారత్‌ సారథి రోహిత్‌శర్మ పేరిట ఉంది. కాగా ఈ వికెట్‌పై వన్డే క్రికెట్‌లో అత్యల్ప స్కోరు (79) చేసిన చెత్త రికార్డు న్యూజిలాండ్‌ పేరిట ఉంది. 2016 అక్టోబరు 29న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 259 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ 23.1 ఓవర్లలో 79 పరుగులకు కుప్పకూలింది.

టీమిండియా: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్

ఆస్ట్రేలియా: టి.హెడ్, మార్ష్, లబు షేన్, స్మిత్ (కెప్టెన్), గ్రీన్, కేరీ (వికెట్ కీపర్), స్టోనిస్, స్టార్క్, ఎల్లిస్, అబాట్, జంపా

మ్యాచ్‌ టైమింగ్స్‌:

* తొలి సెషన్‌ మధ్యాహ్నం 1.30 నుంచి 5.00 గంటల వరకు

* సెకండ్‌ సెషన్‌ సాయంత్రం 5.45 నుంచి మ్యాచ్‌ పూర్తయ్యే వరకు

* సాయంత్రం 5.00 నుంచి 5.45 గంటల వరకు 45 నిమిషాలు బ్రేక్

Updated Date - 2023-03-19T13:34:44+05:30 IST