Anand Mahindra- Siraj: సిరాజ్‌కు ఎస్‌యూవీ ఇవ్వమని అభిమాని నుంచి రిక్వెస్ట్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-09-18T16:20:21+05:30 IST

సిరాజ్ అద్భుత ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా సిరాజ్‌ను కొనియాడారు.

Anand Mahindra- Siraj: సిరాజ్‌కు ఎస్‌యూవీ ఇవ్వమని అభిమాని నుంచి రిక్వెస్ట్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?

కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడంతో మొత్తంగా 6 వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించాడు. సిరాజ్ దెబ్బకు లంకేయులు 50 పరుగులకే కుప్పకూలారు. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా చేధించి 10 వికెట్లు తేడాతే ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో 8వ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. అయితే సిరాజ్ అద్భుత ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా సిరాజ్‌ను కొనియాడారు."మన ప్రత్యర్థుల కోసం నేను ఇంతకు ముందెన్నడూ బాధపడలేదు. అయితే ఇప్పుడు మనం వారిపై ఏదో ఒక అతీంద్రియ శక్తిని విడుదల చేసినట్లుగా ఉంది. సిరాజ్ నువ్వొక మార్వెల్ అవెంజర్" అని ఆయన ట్వీట్ చేశారు.


అయితే ఈ ట్వీట్‌ను రిట్వీట్ చేసిన ఓ అభిమాని ‘‘ సార్, దయచేసి సిరాజ్‌కు ఓ ఎస్‌యూవీని ఇవ్వండి’’ అని రాసుకొచ్చారు. అయితే దానికి ఆనంద్ మహీంద్రా బదులిస్తూ సిరాజ్‌కు గతంలోనే ఓ కారు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా సిరాజ్‌కు 2021లోనే ఆనంద్ మహీంద్రా ‘థార్‌’ను బహుమతిగా ఇచ్చారు. ఆసీస్‌తో టెస్టు మ్యాచ్ గెలిచిన సందర్భంగా అప్పట్లో ఆ కారును బహుకరించారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద్వారా తనకు లభించిన ప్రైజ్ మనీని కొలంబో గ్రౌండ్ సిబ్బందికి బహుమతిగా ఇస్తున్నట్లు సిరాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా స్పందించిన ఆనంద్ మహీంద్రా సిరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. సిరాజ్ నిర్ణయంపై ఒక మాట చెబుదామనుకుంటున్నానని, అది క్లాస్ అని పేర్కొన్నారు. ‘‘ఇది మీ సంపద లేదా మీ నేపథ్యం నుంచి వచ్చేది కాదు. మీలో ఉంటేనే బయటికి వస్తుందని’’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Updated Date - 2023-09-18T16:26:48+05:30 IST