WPL 2023: డబ్ల్యూపీఎల్‌లో మరో కీలక పోరు.. గుజరాత్‌పై టాస్ నెగ్గిన ఢిల్లీ

ABN , First Publish Date - 2023-03-16T19:17:24+05:30 IST

మహిళల ఐపీఎల్‌(WPL)లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గెలవక తప్పని పరిస్థితుల్లో ఉన్న గుజరాత్

WPL 2023: డబ్ల్యూపీఎల్‌లో మరో కీలక పోరు.. గుజరాత్‌పై టాస్ నెగ్గిన ఢిల్లీ

ముంబై: మహిళల ఐపీఎల్‌(WPL)లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గెలవక తప్పని పరిస్థితుల్లో ఉన్న గుజరాత్ జెయింట్స్(Gujarat Giants), గెలుపు రుచి మరిగిన ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals) తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు చెరో ఐదు మ్యాచ్‌లు ఆడాయి. ఢిల్లీ నాలుగింటిలో గెలిచి ఒక దాంట్లో ఓడితే.. గుజరాత్ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆ జట్టు ఒక్క దాంట్లో విజయం సాధించి, నాలుగింటిలో ఓడింది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా పాయంట్లో పట్టికలో పైకి ఎగబాకాలని జెయింట్స్ పట్టుదలగా ఉంది. ఢిల్లీ కూడా అలాంటి భావనతోనే ఉంది. విజయం సాధించడం ద్వారా రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ తప్పకపోవచ్చు.

ఢిల్లీ జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుండగా, గుజరాత్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ జట్టులో తారా నోరిస్‌కు బదులుగా పూనమ్ యాదవ్ జట్టులోకి రాగా, జెయింట్స్ జట్టులో మేఘన, అన్నాబెల్‌కు బదులుగా లారా, అశ్విని జట్టులోకి వచ్చారు.

Updated Date - 2023-03-16T19:17:24+05:30 IST