Share News

ODI World Cup: వైడ్ బాల్ వివాదం.. కోహ్లీదే తప్పు అంటున్న రూల్స్

ABN , First Publish Date - 2023-10-21T15:42:11+05:30 IST

విరాట్ కోహ్లీ సెంచరీ విషయంలో చెలరేగిన వివాదంలో అంపైర్ తప్పు లేదని.. కోహ్లీదే తప్పు ఉందని తాజా రూల్స్ చెప్తున్నాయి. 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్ విషయంలో మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) క్రికెట్ నియమాలను మార్చిందని కొందరు వివరిస్తున్నారు.

ODI World Cup: వైడ్ బాల్ వివాదం.. కోహ్లీదే తప్పు అంటున్న రూల్స్

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 48వ సెంచరీ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. బంగ్లాదేశ్ బౌలర్ వైడ్ బాల్ వేసినా అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఇవ్వలేదని.. కోహ్లీ సెంచరీ కోసమే అలా చేశాడని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. అంపైర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కోహ్లీకి సహకరించాడని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదంలో అంపైర్ తప్పు లేదని.. కోహ్లీదే తప్పు ఉందని తాజా రూల్స్ చెప్తున్నాయి. 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్ విషయంలో మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) క్రికెట్ నియమాలను మార్చిందని కొందరు వివరిస్తున్నారు. బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్స్ ఆడే ప్రయత్నంలో క్రీజులో డ్యాన్స్ చేస్తుండటంతో ఎంసీసీ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. బౌలర్ బంతి వేయకముందే బ్యాటర్ కదిలినప్పుడు వారి పక్క నుంచే వెళ్లిన బంతి వైడ్ ఇవ్వడం సమంజసం కాదని భావించిన ఎంసీసీ ఈ నిబంధనను మార్చింది.

ఇది కూడా చదవండి: IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌పై అదిరిపోయే అప్‌డేట్!

ఈ మేరకు ప్రస్తుతం ఉన్న క్రికెట్ నిబంధనల్లోని 22.1 రూల్‌ను సవరించింది. బౌలర్ తన రనప్ ప్రారంభించినప్పుడు బ్యాటర్ కదిలినా.. కదిలిన చోట నుంచి బ్యాటింగ్ పొజిషన్‌కు వెళ్లినా.. కదిలిన చోటునే పరిగణలోకి తీసుకోవాలని, ఆ ప్లేస్‌ను బట్టే వైడ్‌ నిర్ణయాన్ని ప్రకటించాలని మార్పు చేసింది. అందుకే బంగ్లాదేశ్ మ్యాచ్‌లో నసుమ్ బౌలింగ్ రన్నప్ ప్రారంభించగానే విరాట్ కోహ్లీ లెగ్ స్టంప్ వైపు జరిగి.. బాల్ ముందుకు పడగానే ముందుకు జరిగాడు. ఎంసీసీ కొత్త రూల్స్ ప్రకారం కోహ్లీ వెనక్కి జరిగి ముందుకు రావడంతోనే అంపైర్ కెటిల్ బరో వైడ్ ఇవ్వలేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అటు ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు ఖరారు కావడంతో సెంచరీ చేయడంపై ఫోకస్ పెట్టాలని కేఎల్ రాహుల్ సూచించాడు. ససేమిరా అన్న కోహ్లీని తానే ఒప్పించానని మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు.

Updated Date - 2023-10-21T15:42:11+05:30 IST