Virat Kohli: హఠాత్తుగా ముంబై వెళ్లిన కోహ్లీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌కు డుమ్మా..?

ABN , First Publish Date - 2023-10-02T21:28:01+05:30 IST

స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ హఠాత్తుగా ముంబై వెళ్లిపోయాడు. టీమ్ మేనేజ్‌మెంట్ అనుమతి తీసుకుని మరీ తిరువనంతపురం నుంచి విమానంలో ముంబై వెళ్లినట్లు సమాచారం అందుతోంది.

Virat Kohli: హఠాత్తుగా ముంబై వెళ్లిన కోహ్లీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌కు డుమ్మా..?

వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా కసరత్తులు చేస్తోంది. అయితే తొలి వార్మప్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో రెండో వార్మప్ మ్యాచ్‌పై టీమిండియా దృష్టి సారించింది. మంగళవారం నాడు తిరువనంతపురం వేదికగా నెదర్లాండ్స్‌తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. కానీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ హఠాత్తుగా ముంబై వెళ్లిపోయాడు. టీమ్ మేనేజ్‌మెంట్ అనుమతి తీసుకుని మరీ తిరువనంతపురం నుంచి విమానంలో ముంబై వెళ్లినట్లు సమాచారం అందుతోంది. దీంతో కోహ్లీకి ఏమైందోనని అభిమానులు ఆందోళన పడుతున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో కాశ్మీర్ విల్లో బ్యాట్లు.. 102 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

ఇటీవల విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మరోసారి తల్లి కానున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ముంబైలోని ఓ గైనకాలజిస్ట్ దగ్గరకు కోహ్లీ దంపతులు వెళ్లారని.. అప్పుడే ఈ గుడ్ న్యూస్ తెలిసిందని పేర్కొన్నాయి. కానీ కోహ్లీ మాత్రం అనుష్క ప్రెగ్నెన్సీ వార్తలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా ముంబై వెళ్లడం వెనుక కారణం ఇదేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే రెండు రోజుల్లో ఈ గుడ్‌న్యూస్‌ను అతడు ఫ్యాన్స్‌తో పంచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వ్యక్తిగత కారణాలు ఎలా ఉన్నా కోహ్లీ ఫిట్‌నెస్‌ కాపాడుకుని ప్రపంచకప్‌లో అదరగొట్టాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలో మంగళవారం జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక అందజేసింది. కాగా కోహ్లీ తిరిగి ఎప్పుడు జట్టుతో కలుస్తాడో అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - 2023-10-02T21:28:01+05:30 IST