Share News

Best Test Team 2023: ఈ ఏడాది అత్యుత్తమ జట్టు ఇదే.. ముగ్గురు భారత్ ఆటగాళ్లకు చోటు

ABN , Publish Date - Dec 26 , 2023 | 06:56 PM

Best Test Team 2023: టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ మేరకు టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు.

Best Test Team 2023: ఈ ఏడాది అత్యుత్తమ జట్టు ఇదే.. ముగ్గురు భారత్ ఆటగాళ్లకు చోటు

మరికొద్దిరోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో 2023 రివైండ్‌ను కొన్ని సంస్థలు ప్రత్యేకంగా గుర్తుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ మేరకు టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బెస్ట్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు.

బెస్ట్ ఎలెవన్ టీమ్‌లో ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా), రోహిత్ శర్మ (భారత్), జో రూట్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), జానీ బెయిర్ స్టో (ఇంగ్లండ్), రవీంద్ర జడేజా (భారత్), రవిచంద్రన్ అశ్విన్ (భారత్), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) ఉన్నారు. నిజానికి ఈ ఏడాది రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీనే ఎక్కువ పరుగులు చేశాడు. కోహ్లీ 8 టెస్టుల్లో 59.10 సగటుతో 591 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. రోహిత్ కూడా 8 టెస్టులు ఆడగా 12 ఇన్నింగ్స్‌ల్లో 45.41 సగటుతో 545 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి కోహ్లీని కాదని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ రోహిత్‌ను ఎందుకు ఎంపిక చేసిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 06:56 PM