Share News

IND Vs BAN: కోహ్లీ సిక్సర్.. ఇటు సెంచరీ.. అటు టీమిండియా గెలుపు

ABN , First Publish Date - 2023-10-19T21:38:44+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

IND Vs BAN: కోహ్లీ సిక్సర్.. ఇటు సెంచరీ.. అటు టీమిండియా గెలుపు

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. పూణె వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ శుభారంభం అందించారు. అయితే రోహిత్ 48 పరుగుల వద్ద అవుటై హాఫ్ సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అటు శుభ్‌మన్ గిల్ మాత్రం ప్రపంచకప్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. వీళ్లిద్దరూ అవుటైనా కోహ్లీ, కేఎల్ రాహుల్ విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా మ్యాచ్ చివర్లో కోహ్లీ సెంచరీ పూర్తి చేస్తాడా లేదా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే విరాట్ కోహ్లీ సిక్సర్‌తో ఇటు సెంచరీని, అటు జట్టు గెలుపును పూర్తి చేయడం మ్యాచ్‌కే ఆకర్షణగా నిలిచింది.

ఇది కూడా చదవండి: ODI World Cup: బ్రియాన్ లారా రికార్డును అధిగమించిన రోహిత్, విరాట్ కోహ్లీ

వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది 48వ సెంచరీ. మరో సెంచరీ చేస్తే క్రికెట్ లెజెండ్ సచిన్ రికార్డును బద్దలు కొడతాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 97 బాల్స్‌లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి కేఎల్ రాహుల్ మంచి సహకారం అందించాడు. 34 బాల్స్‌లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అతడు 34 రన్స్ చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యంత వేగంగా 26వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 511 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.

Updated Date - 2023-10-19T21:38:44+05:30 IST