Share News

ODI World Cup: బ్రియాన్ లారా రికార్డును అధిగమించిన రోహిత్, విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2023-10-19T21:18:57+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. ఈ క్రమంలో బ్రియాన్ లారా రికార్డును వాళ్లిద్దరూ అధిగమించారు.

 ODI World Cup: బ్రియాన్ లారా రికార్డును అధిగమించిన రోహిత్, విరాట్ కోహ్లీ

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లో విఫలమైనా తదుపరి మూడు మ్యాచ్‌ల్లోనూ రాణించాడు. ఆప్ఘనిస్తాన్‌పై సెంచరీ చేసిన అతడు.. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బంగ్లాదేశ్‌పై మాత్రం తృటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. 48 పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మ 1243 పరుగులకు చేరుకున్నాడు. 21 మ్యాచ్‌లలో రోహిత్ ఈ ఫీట్ అందుకున్నాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాను దాటాడు. వన్డే ప్రపంచకప్‌ హిస్టరీలో 34 మ్యాచ్‌లు ఆడిన బ్రియాన్ లారా 1225 పరుగులు చేశాడు.

ఇది కూడా చదవండి: ODI World Cup: ప్రపంచకప్‌లో డీఆర్ఎస్‌పై వివాదం.. అసంతృప్తి వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా

మరోవైపు విరాట్ కోహ్లీ కూడా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనే బ్రియాన్ లారాను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 30 మ్యాచ్‌లు ఆడి 1260 ప్లస్ పరుగులు చేశాడు. దీంతో అతడు నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఐదో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. కాగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 45 మ్యాచ్‌లు ఆడి 2278 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఉన్నాడు. అతడు 46 మ్యాచ్‌లు ఆడి 1743 పరుగులు చేశాడు. మూడో స్థానంలో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర ఉన్నాడు. అతడు 37 మ్యాచ్‌లు ఆడి 1532 పరుగులు చేశాడు.

Updated Date - 2023-10-19T21:18:57+05:30 IST