Share News

Virat Kohli: దక్షిణాఫ్రికా వెళ్లి టీమిండియాతో కలిసి కింగ్ విరాట్ కోహ్లీ.. సడెన్‌గా మూడు రోజులపాటు ఎక్కడికి వెళ్లాడంటే..

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:47 AM

దక్షిణాఫ్రికా నుంచి అకస్మాత్తుగా భారత్ వచ్చిన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో కలిశాడు. డిసెంబర్ 26 నుంచి మొదలుకానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నాడు. సెలవు తీసుకున్న మూడు రోజులు కోహ్లీ లండన్‌లో ఉన్నాడని, ఈ మేరకు తన ప్రణాళికలను ముందుగానే టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేశాడని బీసీసీబీ వర్గాలు వెల్లడించాయి.

Virat Kohli: దక్షిణాఫ్రికా వెళ్లి టీమిండియాతో కలిసి కింగ్ విరాట్ కోహ్లీ.. సడెన్‌గా మూడు రోజులపాటు ఎక్కడికి వెళ్లాడంటే..

క్షిణాఫ్రికా నుంచి అకస్మాత్తుగా భారత్ వచ్చిన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో కలిశాడు. డిసెంబర్ 26 నుంచి మొదలుకానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నాడు. సెలవు తీసుకున్న మూడు రోజులు కోహ్లీ లండన్‌లో ఉన్నాడని, ఈ మేరకు తన ప్రణాళికలను ముందుగానే టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేశాడని బీసీసీబీ వర్గాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు కోహ్లీ లండన్‌ పర్యటనకు వెళ్లాడని, అందుకే ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడలేదని బీసీసీఐ సీనియర్ అధికారి చెప్పారని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

‘‘ విరాట్ కోహ్లీ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడం ముందుగానే తెలుసు. అతడి ప్లాన్, షెడ్యూల్ గురించి టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ముందే తెలుసు. ఇది రాత్రికి రాత్రే జరిగిన పరిణామం కాదు. కోహ్లీ కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ అసలే కాదు. మీరు ప్రశ్నిస్తున్న ఆటగాడు ఎవరో తెలుసా? విరాట్ కోహ్లీ. అన్ని విషయాల్లో చాలా ప్రణాళికాబద్ధంగా అతడు ఉంటాడు. లండన్ పర్యటన గురించి ముందుగానే చెప్పాడు’’ అని ఓ బీసీసీఐ అధికారిని ఉటంకిస్తూ న్యూస్ 18 రిపోర్ట్ పేర్కొంది.


కోహ్లీ డిసెంబరు 19న లండన్ వెళ్లడానికి ముందు టీమ్‌తో కలిసి పలు ట్రైనింగ్ సెషన్‌లలో పాల్గొన్నాడని, జట్టుతో కలిసిన తర్వాత తిరిగి ప్రాక్టీస్ మొదలుపెడతాడని సదురు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. కాగా విరాట్ కోహ్లీ భారత్‌లో బయలుదేరి డిసెంబర్ 15న దక్షిణాఫ్రికా చేరుకున్నాడు. లండన్ వెళ్లడానికి ముందు 3-4 ట్రైనింగ్ సెషన్లలో పాల్గొన్నాడు. కాగా డిసెంబర్ 26న మొదలవనున్న టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా పేసర్లు కగిసో రబాడ, లుంగి ఎంగిడీలు నెట్‌లో గాయపడి జట్టుకు దూరమైనప్పటికీ టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికాదే పైచేయి అవుతుందని ఆ జట్టు కోచ్ షుక్రీ కొన్రాడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

Updated Date - Dec 24 , 2023 | 11:48 AM