IND Vs AUS: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

ABN , First Publish Date - 2023-09-18T21:31:31+05:30 IST

సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి వన్డే మొహాలీ వేదికగా ఈనెల 22న, రెండో వన్డే ఇండోర్ వేదికగా ఈనెల 24న, మూడో వన్డే రాజ్‌కోట్ వేదికగా ఈనెల 27న జరుగుతాయి.

IND Vs AUS: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

ఆసియా కప్ ముగిసిన వెంటనే టీమిండియా మరో సమరానికి సిద్ధమవుతోంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. అయితే ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చింది. అతడితో పాటు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లకు కూడా విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో సెలక్టర్లు కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. అంతేకాకుండా వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా బాధ్యతలు చేపట్టనున్నాడు. మూడో వన్డేకు మాత్రం రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. చివరి వన్డేకు అతడే కెప్టెన్‌‌ బాధ్యతలను నిర్వర్తిస్తాడు. వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తాడు. కాగా తొలి రెండు వన్డేలకు 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించిన సెలక్టర్లు.. మూడో వన్డేకు మాత్రం 17 మంది సభ్యులను ఎంపిక చేశారు.

australia odi series.jpg

సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి వన్డే మొహాలీ వేదికగా ఈనెల 22న, రెండో వన్డే ఇండోర్ వేదికగా ఈనెల 24న, మూడో వన్డే రాజ్‌కోట్ వేదికగా ఈనెల 27న జరుగుతాయి. అన్ని మ్యాచ్‌లు డే/నైట్ కింద నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. జియో సినిమా యాప్‌లో మూడు వన్డేల సిరీస్‌ను ఉచితంగా వీక్షించవచ్చు.

తొలి రెండు వన్డేలకు టీమిండియా:

కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

మూడో వన్డేకు టీమిండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Updated Date - 2023-09-18T21:31:31+05:30 IST