MS Dhoni: ధోనీ అంతమందితో లవ్ అఫైర్ నడిపాడా?

ABN , First Publish Date - 2023-07-07T16:57:44+05:30 IST

ఫీల్డింగ్‌లో ధోనీ మిస్టర్ పర్‌ఫెక్ట్. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ పెళ్లికి ముందు ధోనీ అనేక మంది బాలీవుడ్ హీరోయిన్‌లతో లవ్ అఫైర్ నడిపాడన్న రూమర్లు వినిపించాయి. ఈ జాబితాలో దీపికా పదుకునే, అశిన్, లక్ష్మీరాయ్ ఉన్నారు

MS Dhoni: ధోనీ అంతమందితో లవ్ అఫైర్ నడిపాడా?

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ధోనీ గతంలో ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం ధోనీ నడిపిన లవ్ అఫైర్ల గురించి కూడా చర్చించుకుంటున్నారు.

2010లో ధోనీ వివాహం చేసుకున్నాడు. ధోనీ-సాక్షి దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. ఇటీవల ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన తర్వాత తన కుమార్తెతో పాటు ధోనీ చేసుకున్న సంబరాలను అభిమానులు అందరూ వీక్షించే ఉంటారు. ఫీల్డింగ్‌లో ధోనీ మిస్టర్ పర్‌ఫెక్ట్. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ పెళ్లికి ముందు ధోనీ అనేక మంది బాలీవుడ్ హీరోయిన్‌లతో లవ్ అఫైర్ నడిపాడన్న రూమర్లు వినిపించాయి. స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను ధోనీ ప్రేమించాడని.. ఆమె కోసం తన హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాడని గాసిప్స్ వినిపించాయి. అయితే మరో టీమిండియా క్రికెటర్ యువరాజ్ కూడా దీపికాను లవ్ చేయడంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని.. దీపికా కారణంగానే ధోనీ, యువరాజ్ మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు షికారు చేశాయి.

ఇది కూడా చదవండి: రింకూ సింగ్‌ను అందుకే ఎంపిక చేయలేదా? బీసీసీఐ స్పందన ఇదే..!!

మరోవైపు హీరోయిన్ అశిన్‌తో కూడా ధోనీ ప్రేమాయణం నడిపినట్లు పుకార్లు వినిపించాయి. హిందీ గజినీ సినిమాతో విపరీతంగా క్రేజ్ సంపాదించిన అసిన్, ధోనీ ప్రేమించుకుంటున్నారని పలు వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి. కానీ అశిన్ ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోవడంతో ఈ వార్తలకు తెరపడింది. అనంతరం హీరోయిన్ లక్ష్మీరాయ్‌ను కూడా ధోనీ లవ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ధోనీ బయోపిక్ ధోనీ-అన్‌టోల్డ్ స్టోరీలో లవర్ పాత్ర లక్ష్మీరాయ్‌దేనని కూడా విమర్శకులు ఆరోపించారు. ఇలా పలువురు హీరోయిన్‌లతో ధోనీకి లవ్ అఫైర్స్ ఉన్నాయని ఫ్యాన్స్ నెమరువేసుకుంటున్నారు. అయితే యవ్వనంలో ఉన్నప్పుడు స్టార్ క్రికెటర్లకు లవ్ అఫైర్స్ సర్వసాధారణమేనని పలువురు కొట్టిపడేస్తున్నారు. కాగా ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ప్రస్తుతం ఐపీఎల్‌లో ఇంకా ఆడుతున్నాడు. అతడి నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

Updated Date - 2023-07-07T17:00:28+05:30 IST