Share News

IND (W) Vs ENG (W): అదరగొట్టిన దీప్తి శర్మ.. టీమిండియాకు భారీ ఆధిక్యం

ABN , Publish Date - Dec 15 , 2023 | 02:15 PM

IND (W) Vs ENG (W): ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళలు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ టెస్టులో తొలిరోజే బజ్‌బాల్ తరహాలో ఆడిన టీమిండియా బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. బౌలింగ్‌లోనూ అదరగొట్టి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

IND (W) Vs ENG (W): అదరగొట్టిన దీప్తి శర్మ.. టీమిండియాకు భారీ ఆధిక్యం

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళలు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ టెస్టులో తొలిరోజే బజ్‌బాల్ తరహాలో ఆడిన టీమిండియా బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 104.3 ఓవర్లలో 428 పరుగులకు ఆలౌటైంది. సతీష్ శుభ (69), జెమీమా రోడ్రిగ్స్ (68), దీప్తి శర్మ (67), యాస్తికా భాటియా (66), హర్మన్ ప్రీత్‌కౌర్ (49) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 3 వికెట్లు, సోఫియా ఎకిల్‌స్టోన్ 3 వికెట్లు పడగొట్టారు. రెండో రోజు ఇంగ్లండ్ బ్యాటర్లు మాత్రం టీమిండియా బౌలర్లకు దాసోహం అన్నారు. కేవలం 35.3 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది.

13 పరుగుల వద్ద సోఫియా డంక్లీని రేణుకా సింగ్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ వికెట్ల పతనానికి తెరలేచింది. అక్కడి నుంచి ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. నట్ సీవర్ బ్రంట్ మినహాయిస్తే ఎవరూ నిలవలేకపోయారు. బ్రంట్ హాఫ్ సెంచరీ చేయడంతో ఇంగ్లండ్ 136 పరుగులైనా చేయగలిగింది. లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ అదరగొట్టింది. ఆమె కేవలం 5.3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 7 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. స్నేహ్ రానా 2 వికెట్లు, రేణుకా సింగ్ ఒక వికెట్ సాధించారు. భారత్‌కు 292 పరుగుల భారీ ఆధిక్యం లభించినా.. ఇంగ్లండ్‌ను ఫాలో ఆన్ ఆడించలేదు. టీమిండియానే తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 15 , 2023 | 02:15 PM