Share News

SA Vs IND: రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్‌లు

ABN , First Publish Date - 2023-11-30T21:05:17+05:30 IST

Team India: డిసెంబరులో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ మేరకు గురువారం మూడు ఫార్మాట్లకు బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. అయితే మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్‌లను సెలక్టర్లు ప్రకటించారు.

SA Vs IND: రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్‌లు

డిసెంబరులో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ మేరకు గురువారం మూడు ఫార్మాట్లకు బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. అయితే మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్‌లను సెలక్టర్లు ప్రకటించారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటారని వెల్లడించారు. వైట్ బాల్ క్రికెట్‌కు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి ఇచ్చామని తెలిపారు. టెస్టులకు మహ్మద్ షమీ పేరును పరిగణనలోకి తీసుకున్నా.. ఆ సమయానికి అతడు ఫిట్‌గా ఉంటేనే ఆడతాడని సెలక్టర్లు చెప్పారు. ఎట్టకేలకు సంజు శాంసన్‌కు వన్డేల్లో చోటు కల్పించారు. వన్డే జట్టులో సాయి సుదర్శన్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. టీ20లకు 17 మందిని, వన్డేలకు 16 మందిని, టెస్టులకు 16 మందిని సెలక్ట్ చేసినట్లు తెలిపారు. రుతురాజ్ గైక్వా్డ్, శ్రేయాస్ అయ్యర్, ముఖేష్ కుమార్ మాత్రమే మూడు ఫార్మాట్లకు ఎంపికయ్యారు.

టీ20 జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), యషస్వీ జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, సంజు శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్

టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యషస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసీధ్ కృష్ణ


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-30T21:05:19+05:30 IST