Share News

SA Vs IND: కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్

ABN , Publish Date - Dec 27 , 2023 | 03:09 PM

SA Vs IND: సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రెండో రోజు ఉదయం సెషన్‌లో 67.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీతో అదరగొట్టడంతో టీమిండియా స్కోరు 200 పరుగులు దాటింది. 137 బాల్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లలో కేఎల్ రాహుల్ 101 పరుగులు చేశాడు.

SA Vs IND: కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్

సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రెండో రోజు ఉదయం సెషన్‌లో 67.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీతో అదరగొట్టడంతో టీమిండియా స్కోరు 200 పరుగులు దాటింది. 137 బాల్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లలో కేఎల్ రాహుల్ 101 పరుగులు చేశాడు. అతడికి సిరాజ్ (5) మరో ఎండ్‌లో మంచి సహకారం అందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 5 వికెట్లు, అరంగేట్ర బౌలర్ బర్గర్ మూడు వికెట్లు, మార్కో యాన్‌సన్, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ పడగొట్టారు.

తొలి రోజు టెస్టులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా.. ఆదిలోనే షాక్ తగిలింది. వరుసగా వికెట్లు పడటంతో రోహిత్ సేన కష్టాల్లో పడింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై సఫారీ పేసర్లు విజృంభించడంతో రోహిత్ (5), జైశ్వాల్ (17), గిల్ (2) వరుసగా అవుటయ్యారు. విరాట్ కోహ్లీ (38), శ్రేయాస్ అయ్యర్ (31) వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నా వీళ్లిద్దరూ అవుట్ కావడంతో పరిస్థితి మొదటికొచ్చింది. అయితే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 03:12 PM