Share News

David Warner: డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ABN , Publish Date - Dec 19 , 2023 | 07:21 PM

David Warner: ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు.

David Warner: డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు. గతంలో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వార్నర్ వ్యవహరించాడు. 2016లో ఛాంపియన్‌గానూ నిలబెట్టాడు. అయితే ఐపీఎల్ 2024 వేలం పాట సందర్భంగా అత్యధిక ధరకు అమ్ముడుపోయిన తన సహచరులు ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్‌లను అభినందించేందుకు వార్నర్ ప్రయత్నించగా.. సదరు ఆటగాళ్లను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ అతడిని బ్లాక్ చేసిన ఘటన వెలుగు చూసింది.

కాగా 2014 ఐపీఎల్ వేలం సందర్భంగా వార్నర్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. అనంతరం జరిగిన సీజన్‌లలో హైదరాబాద్ తరపున స్టార్ ఆటగాళ్లలో వార్నర్ ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అంతేకాదు ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు (848) చేసిన ఆటగాళ్లలో రెండో స్థానం వార్నర్‌దే. అయితే బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం తర్వాత 2021లో సన్‌రైజర్స్ వార్నర్‌ను అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పించింది. అంతేకాకుండా 2022 మెగా వేలానికి ముందు జట్టు నుంచి రిలీజ్ చేసింది. దీంతో డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 19 , 2023 | 07:21 PM