Sunil Gavaskar: కెప్టెన్సీలో అతడు కూడా ధోనీ లాంటోడే!

ABN , First Publish Date - 2023-04-29T17:37:43+05:30 IST

డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఈసారి కూడా జోరు

Sunil Gavaskar: కెప్టెన్సీలో అతడు కూడా ధోనీ లాంటోడే!

న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఈసారి కూడా జోరు ప్రదర్శిస్తోంది. కొన్ని గెలవాల్సిన మ్యాచుల్లో ఓడినప్పటికీ మళ్లీ గెలుపు ట్రాక్ పట్టింది. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తొలి సీజన్‌లో అరంగేట్ర జట్టుకు ట్రోఫీ అందించి శభాష్ అనిపించుకున్నాడు.

ఈ బరోడా ఆల్‌ రౌండర్‌పై టీమిండియా మాజీ స్కిప్పర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్సీలో అతడు ధోనీకి సరిపోలుతాడని చెప్పాడు. నిజానికి జట్టు వ్యక్తిత్వం, కెప్టెన్ వ్యక్తిత్వం భిన్నంగా ఉంటాయని, కొన్నిసార్లు కెప్టెన్లు తమ వ్యక్తిత్వాన్ని జట్టుపై రుద్దాలని చూస్తారని సన్నీ పేర్కొన్నాడు. అయితే, హార్దిక్ మాత్రం అలా ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా అది అతడి వారసత్వం కాబోతోందని అన్నారు. కెప్టెన్‌గా అతడు వ్యవహరిస్తున్న తీరు ధోనీని గర్తు చేస్తోందని పేర్కొన్నాడు. హార్దిక్ తన మాజీ కెప్టెన్ నుంచి మంచి లక్షణాలను అలవరచుకున్నాడని గవాస్కర్ ప్రశంసించాడు.

Updated Date - 2023-04-29T17:37:43+05:30 IST