Share News

SA Vs IND: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా సఫారీలు

ABN , Publish Date - Dec 27 , 2023 | 09:40 PM

SA Vs IND: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. వెలుతురులేమి కారణంగా షెడ్యూల్ కంటే ముందు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.

SA Vs IND: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా సఫారీలు

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. వెలుతురులేమి కారణంగా షెడ్యూల్ కంటే ముందు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. దీంతో టీమిండియాపై 11 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంకా ఐదు వికెట్లు చేతిలో ఉండటంతో సఫారీలు భారీ ఆధిక్యం సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓపెనర్ డీన్ ఎల్గార్ అద్భుత సెంచరీతో తన జట్టును ఆదుకున్నాడు. 113 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా డేవిడ్ బెడింగ్ హామ్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నిర్మించాడు. ఎల్గార్-బెడింగ్ హామ్ మధ్య 131 పరుగుల పార్ట్‌నర్ షిప్ నమోదైంది. బెడింగ్ హామ్ అవుటయ్యాక దక్షిణాఫ్రికా వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు.

టీమిండియా బౌలర్లలో బుమ్రాకు రెండు వికెట్లు, సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అరంగేట్ర బౌలర్ ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా అంతకుముందు 208/8 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 67.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. 137 బాల్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లలో కేఎల్ రాహుల్ 101 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ ఎయిడెన్ మార్‌క్రమ్(5), కీగన్ పీటర్సన్(2), టోనీ డీ జోర్జీ(28) విఫలమయ్యారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 09:40 PM