Border Gavaskar Trophy: కోలుకున్న శ్రేయాస్ అయ్యర్.. ఢిల్లీ టెస్టుకు రెడీ

ABN , First Publish Date - 2023-02-14T21:51:07+05:30 IST

గాయం కారణంగా ఆస్ట్రేలియా(Australia)తో నాగ్‌పూర్‌(Nagpur)లో జరిగిన తొలి

 Border Gavaskar Trophy: కోలుకున్న శ్రేయాస్ అయ్యర్.. ఢిల్లీ టెస్టుకు రెడీ

న్యూఢిల్లీ: గాయం కారణంగా ఆస్ట్రేలియా(Australia)తో నాగ్‌పూర్‌(Nagpur)లో జరిగిన తొలి టెస్టుకు దూరమైన టీమిండియా స్టార్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) ఢిల్లీలో ఈ నెల 17 నుంచి జరగనున్న రెండో టెస్టుకు రెడీ అయ్యాడు. శ్రేయాస్ దూరం కావడంతో అతడి స్థానాన్ని భర్తీ చేసిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. శ్రేయాస్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శ్రేయాస్ విజయవంతంగా పునరావాసం పూర్తి చేసుకోవడంతో ఢిల్లీ టెస్టులో ఆడేందుకు అనుమతి బీసీసీఐ మెడికల్ టీం అనుమతి ఇచ్చింది.

అయ్యర్ కనుక తుది జట్టులో స్థానం సంపాదించుకుంటే సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్‌(KS Bharat)లలో ఎవరో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. భరత్ కనుక తప్పుకుంటే అప్పుడు కేఎల్ రాహుల్(KL Rahul) కీపింగ్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. నాగ్‌పూర్ టెస్టులో ఆల్‌రౌండర్ ప్రతిభతో అదరగొట్టిన రోహిత్ సేన ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టెస్టును రెండున్నర రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రెండో టెస్టుకు భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్

Updated Date - 2023-02-14T21:51:09+05:30 IST