Team India: టీమిండియాపై పాకిస్థాన్ లెజెండ్ ప్రశంసలు.. వరల్డ్ కప్ కూడా గెలిచేస్తారేమో..!!

ABN , First Publish Date - 2023-09-18T17:00:19+05:30 IST

ఆసియా కప్‌ను టీమిండియా అండర్ డాగ్స్‌లా ప్రారంభించిందని, కానీ టోర్నీలో ఒక్కో మ్యాచ్‌కూ మెరుగవుతూ వచ్చిందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. మోస్ట్ డేంజరస్ జట్టుగా ఇప్పుడు వరల్డ్ కప్ వైపు టీమిండియా అడుగులు వేస్తోందన్నాడు.

Team India: టీమిండియాపై పాకిస్థాన్ లెజెండ్ ప్రశంసలు.. వరల్డ్ కప్ కూడా గెలిచేస్తారేమో..!!

టీమిండియా రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్ గెలవడంతో సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. దీంతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్, లెజెండ్ షోయబ్ అక్తర్ కూడా టీమిండియా ప్రదర్శనను కొనియాడాడు. ఆసియా కప్‌ను టీమిండియా అండర్ డాగ్స్‌లా ప్రారంభించిందని, కానీ టోర్నీలో ఒక్కో మ్యాచ్‌కూ మెరుగవుతూ వచ్చిందని పేర్కొన్నాడు. మోస్ట్ డేంజరస్ జట్టుగా ఇప్పుడు వరల్డ్ కప్ వైపు టీమిండియా అడుగులు వేస్తోందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. నిజంగా చెప్పాలంటే భారత్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌ టోర్నీకి వెళ్తోందని.. ఈ విషయం పాకిస్థాన్‌కే కాదు.. మిగతా అన్ని జట్లకు ఆందోళన కలిగించే విషయమే అని పేర్కొన్నాడు. ఆసియా కప్ విజయంతో తాము ఘనంగా ప్రపంచకప్‌లోకి అడుగుపెడుతున్నామంటూ టీమిండియా ప్రకటించుకుందని అక్తర్ తెలిపాడు.

ఇది కూడా చదవండి: IND vs SL: అందుకే సిరాజ్‌తో 7 ఓవర్లే వేయించా: రోహిత్ శర్మ

ఆసియా కప్‌లో ఇలాంటి ఏకపక్ష ఫైనల్‌ జరుగుతుందని తాను ఊహించలేదని షోయబ్ అక్తర్ అన్నాడు. రోహిత్‌ కెప్టెన్సీ మెరుగుపడిందని.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో కలిసి అతడు గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నాడని కితాబిచ్చాడు. ఏడాదిన్నరగా రోహిత్ కెప్టెన్సీ అంతంత మాత్రంగానే ఉందని.. ఇప్పుడు మాత్రం అదరగొడుతున్నాడని.. సరైన టైంలో కుల్‌దీప్‌ను టీమ్‌లోకి తీసుకుని విజయాలను పొందుతున్నాడని వివరించాడు. ఫైనల్‌లో శ్రీలంకను ఇంత దారుణంగా ఓడిస్తారని అనుకోలేదని.. ఇక ఇప్పటి నుంచే వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ అత్యంత ప్రమాదకరమైన జట్టుగా మారవచ్చని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్‌లో లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడిన తీరు చూస్తే భారత ఆటగాళ్లు అండర్‌డాగ్స్‌లా కనిపించారని. కానీ ఆ తర్వాత చెలరేగి ఆడారని.. హ్యాట్సాఫ్ ఇండియా అంటూ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Updated Date - 2023-09-18T17:00:19+05:30 IST