Share News

Rohit Sharma: సఫారీ గడ్డపై టీమిండియా కెప్టెన్ చెత్త రికార్డు

ABN , Publish Date - Dec 26 , 2023 | 09:52 PM

Rohit Sharma: దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో రోహిత్ 9 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అతడు వరుసగా 14, 6, 0, 25, 11, 10, 10, 47, 5 పరుగులు మాత్రమే చేశాడు. సగటు కేవలం 14.22 మాత్రమే. దీంతో 9 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన తొలి టీమిండియా బ్యాటర్‌గా రోహిత్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Rohit Sharma: సఫారీ గడ్డపై టీమిండియా కెప్టెన్ చెత్త రికార్డు

వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు మళ్లీ మైదానంలో కనిపించాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ బరిలోకి దిగగా.. అతడు భారీ స్కోరు సాధించాలని అభిమానులు ఆశించారు. అయితే దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో రోహిత్ 9 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అతడు వరుసగా 14, 6, 0, 25, 11, 10, 10, 47, 5 పరుగులు మాత్రమే చేశాడు. సగటు కేవలం 14.22 మాత్రమే. దీంతో 9 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన తొలి టీమిండియా బ్యాటర్‌గా రోహిత్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా ఈ టెస్టులో రోహిత్ సాధించిన ఓ రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించడం మరో గమనించాల్సిన విషయం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు రోహిత్ 2,097 పరుగులు చేయగా సెంచూరియన్ టెస్టులో కోహ్లీ ఈ రికార్డును అధిగమించాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ (3,987) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్ (3,641) రెండో స్థానంలో ఉండగా.. స్టీవ్ స్మిత్ (3223), బెన్ స్టోక్స్ (2,710), బాబర్ ఆజమ్ (2,570), ఉస్మాన్ ఖవాజా (2,412) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 09:52 PM