Team India: రోహిత్ శర్మకు మతిమరుపు.. కోహ్లీ చెప్పింది నిజమైందిగా..!!
ABN , First Publish Date - 2023-09-18T20:34:29+05:30 IST
ఆసియా కప్ ముగిసిన తర్వాత కొలంబో నుంచి ముంబై వెళ్తున్న సమయంలో హోటల్ రూంలోనే రోహిత్ తన పాస్‌పోర్టును మరిచిపోయాడు. దీంతో అతడు బస్సులోనే ఉండి వెంటనే తన సపోర్ట్ స్టాఫ్‌ను హోటల్ రూంకు పంపి పాస్‌పోర్టును తెచ్చుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 30 ఏళ్ల వయసులోనే మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నాడు. ఆసియా కప్ ముగిసిన తర్వాత కొలంబో నుంచి ముంబై వెళ్తున్న సమయంలో హోటల్ రూంలోనే తన పాస్‌పోర్టును మరిచిపోయాడు. దీంతో రోహిత్ బస్సులోనే ఉండి వెంటనే తన సపోర్ట్ స్టాఫ్‌ను హోటల్ రూంకు పంపి పాస్‌పోర్టును తెచ్చుకున్నాడు. ఈ కారణంగా టీమ్ సభ్యుల బస్సు ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. రోహిత్ పాస్‌పోర్ట్ మరిచిపోయిన విషయాన్ని తెలిసిన భారత క్రికెటర్లు హిట్‌మ్యాన్‌ను ట్రోల్ చేశారు. సపోర్టింగ్ స్టాఫ్ పాస్ పోర్టు తీసుకురాగానే.. బస్సులో ఉన్న సహచరులంతా గట్టిగా చీర్ చేస్తూ చప్పట్లు కొట్టి రోహిత్‌ను ఆటపట్టించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: ICC ODI Rankings: పాయింట్లు సమానం.. కానీ నంబర్‌వన్ జట్టుగా పాకిస్థాన్
అయితే రోహిత్ ఇలా వస్తువులు మరిచిపోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు రోహిత్ తన మతిమరుపు కారణంగా టీమిండియా సభ్యులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. రోహిత్ మతిమరుపు గురించి గతంలో కోహ్లీ చేసిన కామెంట్స్ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. సదరు వీడియోలో ‘రోహిత్ అంత మతిమరుపు ఉన్న వాళ్లను నేను ఎక్కడా చూడలేదు. అసలు ఎన్ని వస్తువులు మర్చిపోతాడో తెలుసా? ఐప్యాడ్, ఫోన్, వ్యాలెట్, ఏదో చిన్న విషయం మర్చిపోతే ఏం అనలేం. కానీ రోజూ వాడే వస్తువులు కూడా మర్చిపోతాడు. బస్సు సగం దూరం వెళ్లిపోయాక.. తన వస్తువుల గురించి గుర్తుచేస్తాడు’ అని కోహ్లీ వెల్లడించాడు. ఒకసారి రోహిత్ తన పాస్‌పోర్టు మర్చిపోతే చాలా కష్టపడి దాన్ని తిరిగి సంపాదించామని కోహ్లీ తెలిపాడు. ఇలా జరుగుతుందనే తమ లాజిస్టికల్ మేనేజర్ ఎప్పుడూ వచ్చి రోహిత్ శర్మ అన్ని వస్తువులు తెచ్చుకున్నాడా అని అడుగుతుంటాడని వివరించాడు. రోహిత్ పాజిటివ్ సమాధానం ఇచ్చిన తర్వాతే బస్సు కదులుతుందంటూ కోహ్లీ తన వీడియోలో చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఈ విషయం చెప్పి ఆరేళ్లు దాటిపోయింది. కానీ రోహిత్ మాత్రం ఇంకా మతిమరుపుతోనే బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కోహ్లీ చెప్పింది అక్షర సత్యం అని అతడి ఫ్యాన్స్ రోహిత్‌ను ట్రోల్ చేస్తున్నారు.