Rohit Sharma: రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. 146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో తొలి ఆటగాడు..!!

ABN , First Publish Date - 2023-07-24T18:51:43+05:30 IST

146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ స్కోర్ చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

Rohit Sharma: రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. 146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో తొలి ఆటగాడు..!!

వెస్టిండీస్‌(West Indies)తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి టెస్టులో సెంచరీతో సత్తా చాటిన రోహిత్ రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. 146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డు(Record)ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ (Double Digit) స్కోర్ చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర (History) సృష్టించాడు.

చివరి 30 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ 12, 161, 26, 66, 25 నాటౌట్, 49, 34, 30, 36, 12 నాటౌట్, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 46, 120, 32, 12, 12, 35, 15, 43, 103, 80, 57 పరుగులు చేశాడు. గతంలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేల జయవర్ధనే పేరిట ఈ రికార్డు ఉండేది. అతడు వరుసగా 29 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ స్కోర్ అందుకున్నాడు. ఇప్పుడు జయవర్ధనేను రోహిత్ అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, జయవర్ధనే తర్వాత ఇంగ్లండ్ మాజీ ఆటగాడు లెన్ హట్టన్(2), రోహన్ కనహారి(25), ఏబీ డివిలియర్స్(24) ఉన్నారు.

ది కూడా చదవండి: Asia Cup 2023: కుర్రాళ్ల వల్ల కాలేదు.. మరి సీనియర్లు ఏం చేస్తారో?

మరోవైపు టీమిండియా యువ ఓపెనర్ యషస్వీ జైశ్వాల్‌తో కలిసి అత్యంత వేగంగా 50 పరుగుల భాగస్వామ్యాన్ని రోహిత్ నమోదు చేశాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5.5 ఓవర్లలోనే రోహిత్-జైశ్వాల్ జోడీ 50 పరుగుల మార్క్‌ను అందుకుంది. భారత క్రికెట్‌లో ఏ జోడీకైనా ఇదే అత్యంత వేగవంతమైన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. కాగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో టీమిండియా గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 438 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(206 బంతుల్లో 11 ఫోర్లతో 121) సెంచరీతో అదరగొట్టాడు. టెస్ట్ కెరీర్‌లో 29వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 183 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 181/2 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా వెస్టిండీస్ ముందు 365 పరుగుల టార్గెట్ నిలిచింది. నాలుగో రోజు వర్షం వల్ల ఆట ముగిసే సమయానికి కరేబియన్ ఆటగాళ్లు 2 వికెట్లు నష్టపోయి 76 పరుగులు చేశారు. వాళ్లు విజయం సాధించాలంటే ఇంకా 289 పరుగులు చేయాల్సి ఉంది.

Updated Date - 2023-07-24T18:51:43+05:30 IST