ICC Men's T20I Team: ‘ఐసీసీ టీ20 టీం ఆఫ్ ద ఇయర్ 2022’లో కోహ్లీకి చోటు

ABN , First Publish Date - 2023-01-23T21:28:39+05:30 IST

‘టీ20 టీం ఆఫ్ ద ఇయర్-2022’ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్

ICC Men's T20I Team: ‘ఐసీసీ టీ20 టీం ఆఫ్ ద ఇయర్ 2022’లో కోహ్లీకి చోటు

దుబాయ్: ‘టీ20 టీం ఆఫ్ ద ఇయర్-2022’ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. బౌలింగ్, బ్యాటింగ్‌తో దుమ్మురేపిన 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురికి చోటు దక్కింది. వారు ముగ్గురు మరెవరో కాదు.. విరాట్ కోహ్లీ(Virat Kohli), సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), హార్దిక్ పాండ్యా(Hardik Pandya). అలాగే, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, జింబాబ్వే, ఐర్లాండ్, శ్రీలంక ఆటగాళ్లకు కూడా 11 మంది జట్టులో స్థానం లభించింది.

ఐసీసీ టీ20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్-ఇంగ్లండ్), మహమ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), విరాట్ కోహ్లీ (ఇండియా), సూర్యకుమార్ యాదవ్ (ఇండియా), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), సికందర్ రజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్యా (ఇండియా), శామ్ కరన్ (ఇంగ్లండ్), వనిందు హసరంగ (శ్రీలంక), హరీస్ రవూఫ్ (పాకిస్థాన్), జోష్ లిటిల్ (ఐర్లాండ్).

Updated Date - 2023-01-23T21:28:39+05:30 IST