Share News

ODI World Cup: అఫీషియల్.. ఫస్ట్ సెమీస్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్

ABN , First Publish Date - 2023-11-11T19:37:04+05:30 IST

Team India: వన్డే ప్రపంచకప్‌లో నాలుగు సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారయ్యాయి. ఇంగ్లండ్-పాకిస్థాన్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తన లక్ష్యాన్ని నిర్ణీత ఓవర్లలో చేరుకోకపోవడంతో ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు దూరమయ్యాయి. దీంతో అధికారికంగా తొలి సెమీస్ భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతుందని స్పష్టమైంది. రెండో సెమీస్ ఈనెల 16న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతా వేదికగా జరుగుతుంది.

ODI World Cup: అఫీషియల్.. ఫస్ట్ సెమీస్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్

వన్డే ప్రపంచకప్‌లో నాలుగు సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారయ్యాయి. ఇంగ్లండ్-పాకిస్థాన్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తన లక్ష్యాన్ని నిర్ణీత ఓవర్లలో చేరుకోకపోవడంతో ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు దూరమయ్యాయి. దీంతో అధికారికంగా తొలి సెమీస్ భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతుందని స్పష్టమైంది. ఈనెల 15న ముంబై వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ టీమిండియా టేబుల్ టాపర్‌గా నిలవగా న్యూజిలాండ్ నాలుగో స్థానంతో లీగ్ దశను ముగించింది. ఈ ప్రపంచకప్‌లోనూ అది రిపీటైంది. అయితే ఫలితం మాత్రం వేరుగా రావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2019లో జరిగిన ఫస్ట్ సెమీస్‌లో న్యూజిలాండ్ గెలవగా.. ఈ ప్రపంచకప్‌లో భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.

కాగా 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆతిథ్య ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. కానీ ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటి వరకు ఓటమి లేకుండా దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఆదివారం నెదర్లాండ్స్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియానే గెలిచే అవకాశం ఉంది. భారత్ గెలిచినా.. గెలవకున్నా మరోసారి టేబుల్ టాపర్‌గానే లీగ్ దశను ముగించనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేస్తుందా లేదా రెగ్యులర్ జట్టునే బరిలోకి దింపుతుందా అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాహుల్, బుమ్రా, సిరాజ్, జడేజాలకు విశ్రాంతి ఇచ్చి ఇషాన్ కిషన్, ప్రసిధ్ కృష్ణ, అశ్విన్, శార్దూల్ ఠాకూర్‌లను ఆడించనున్నట్లు తెలుస్తోంది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-11T19:37:05+05:30 IST