Share News

ODI World Cup: పరాజయాలకు అడ్డుకట్ట.. ఇంగ్లండ్ ఖాతాలో రెండో విజయం

ABN , First Publish Date - 2023-11-08T21:52:47+05:30 IST

ENG Vs NED: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఊరట విజయం లభించింది. పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్లికలో చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది.

ODI World Cup: పరాజయాలకు అడ్డుకట్ట.. ఇంగ్లండ్ ఖాతాలో రెండో విజయం

వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఖాతాలో రెండో విజయం చేరింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత ఇంగ్లండ్‌కు ఊరట విజయం లభించింది. పుణె వేదికగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 340 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ను 37.2 ఓవర్లలో 179 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ చేసింది. బరేసి (37), ఎంగిల్ బ్రెచ్ట్ (33), స్కాట్ ఎడ్వర్ట్స్ (38), తేజ నిడమానూరు (41 నాటౌట్) మాత్రమే రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిల్ అలీ, ఆదిల్ రషీద్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. డేవిడ్ విల్లీ 2 వికెట్లు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ సాధించారు. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించినా సెమీస్ అవకాశాలు అయితే లేవు. కానీ పాయింట్ల పట్టికలో మాత్రం చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. నెదర్లాండ్స్ మాత్రం చివరి స్థానానికి పడిపోయింది. ఈ టీమ్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆదివారం నాడు టీమిండియాతో తలపడనుంది.

కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలాన్‌ (87)తో పాటు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ సెంచరీతో రాణించాడు. డేవిడ్ మలాన్ 74 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 87 రన్స్ చేశాడు. బెయిర్ స్టో (15), జో రూట్ (28) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. లివింగ్ స్టోన్ స్థానంలో జట్టులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ కూడా విఫలమయ్యాడు. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-08T21:52:48+05:30 IST