Jasprit Bumrah: బుమ్రా గాయానికి శృంగారమే కారణమా? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ

ABN , First Publish Date - 2023-08-17T19:39:33+05:30 IST

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా వెన్నుగాయం తీవ్రం కావడానికి గల కారణాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. విలక్షణ బౌలింగ్ శైలి కారణంగానే బుమ్రా వెన్ను గాయానికి గురయ్యాడని కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం అతడి గాయానికి శృంగారమే కారణమని ఆరోపిస్తున్నారు. ఆరంభంలో వెన్ను గాయం రికవరీలో భాగంగా ఇంటికే పరిమితమైన బుమ్రా పూర్తిగా గాయం నయం కాకముందే సతీమణి‌తో అసహజ శృంగారం చేయడం వెన్ను గాయం తిరగబెట్టేలా చేసిందని కొందరు నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.

Jasprit Bumrah: బుమ్రా గాయానికి శృంగారమే కారణమా? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. వెన్ను గాయం కారణంగా ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ద్వారా పునరాగమనం చేస్తున్నాడు. అది కూడా కెప్టెన్ హోదాలో. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ లాంటి మేజర్ టోర్నీలు సమీపిస్తుండటంతో ఐర్లాండ్‌తో సిరీస్‌లో బుమ్రా ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడ్డ బుమ్రా ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ ఏడాది మార్చిలో వెన్ను గాయానికి శస్త్ర చికిత్స చేయించుకుని ఇటీవల ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేయడమే కాకుండా సారథిగానూ బుమ్రాకు పగ్గాలు అప్పగించింది.

అయితే బుమ్రా వెన్నుగాయం తీవ్రం కావడానికి గల కారణాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. విలక్షణ బౌలింగ్ శైలి కారణంగానే బుమ్రా వెన్ను గాయానికి గురయ్యాడని కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం అతడి గాయానికి శృంగారమే కారణమని ఆరోపిస్తున్నారు. ఆరంభంలో వెన్ను గాయం రికవరీలో భాగంగా ఇంటికే పరిమితమైన బుమ్రా పూర్తిగా గాయం నయం కాకముందే సతీమణి‌తో అసహజ శృంగారం చేయడం వెన్ను గాయం తిరగబెట్టేలా చేసిందని కొందరు నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కోలుకునే దశలో బుమ్రా మళ్లీ గాయపడటం చూస్తుంటే ఈ విషయం అర్ధం అవుతుందని పలువురు సూచిస్తున్నారు. వెన్నుపై ఒత్తిడి పడేలా అతడు శృంగారంలో పాల్గొన్నాడని.. దీంతో ఏడాది కాలం పాటు అతడు జట్టుకు దూరం కావాల్సి వచ్చిందని విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి: India vs Ireland: గత ఐపీఎల్ స్టార్ అరంగేట్రం.. మొదటి టీ20 మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

కాగా ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో బుమ్రా అంచనాల మేరకు రాణిస్తాడా లేదా మరోసారి అతడికి గాయం తిరగబెట్టే అవకాశం ఉందా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. 2021 మార్చి 15న స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేషన్‌ను బుమ్రా పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ ఎఫైర్ నడిపిన బుమ్రా-సంజనా జంట పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం ఫామ్ కోల్పోయిన బుమ్రా చెత్త ప్రదర్శన చేశాడు. 2021లో దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఎన్నో అంచనాలు నెలకొన్న దశలో బుమ్రా పేలవ ప్రదర్శన కారణంగా టీమిండియా సెమీస్ కూడా చేరలేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పైనా ఓటమి చవి చూసి అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత 2022 ఐపీఎల్‌లోనూ బుమ్రా రాణించలేకపోయాడు.

Updated Date - 2023-08-17T19:39:33+05:30 IST