Share News

Chahal-Dhanashree: వైరల్ వీడియో.. పంజాబీ పాటకు భార్యతో కలిసి డ్యాన్స్ వేసిన చాహల్

ABN , Publish Date - Dec 23 , 2023 | 04:32 PM

Chahal-Dhanashree: టీమిండియా క్రికెటర్ చాహల్‌కు ఇటీవల పెద్దగా ఆడే అవకాశం రావడం లేదు. దీంతో సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించుకోవాలని చాహల్ ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు తన భార్యతో కలిసి రీల్స్ చేస్తున్నాడు. ఇటీవల చాహల్-ధనశ్రీ వర్మ తమ మూడో వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి ఓ పంజాబీ పాటకు డ్యాన్స్ వేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Chahal-Dhanashree: వైరల్ వీడియో.. పంజాబీ పాటకు భార్యతో కలిసి డ్యాన్స్ వేసిన చాహల్

టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక కాలేకపోయాడు. అనుభవం ఉండి వికెట్లు సాధిస్తున్నా అతడిని టీమిండియా మేనేజ్‌మెంట్ ఎందుకో పక్కనపెట్టేసింది. ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లగా వన్డే సిరీస్ కోసం చాహల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే అతడికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించుకోవాలని చాహల్ ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు తన భార్యతో కలిసి రీల్స్ చేస్తున్నాడు. ఇటీవల చాహల్-ధనశ్రీ వర్మ తమ మూడో వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి ఓ పంజాబీ పాటకు డ్యాన్స్ వేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్‌లో 72 వ‌న్డేలు ఆడిన చాహ‌ల్ 121 వికెట్లు తీశాడు. టీ20లలో 96 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 2020 డిసెంబర్ 22వ తేదీన చాహల్, ధనశ్రీ వివాహం జరిగింది. కరోనా లాక్‍డౌన్ సమయంలో చాహల్, ధనశ్రీకి ఆన్‍లైన్‍లో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ధనశ్రీ డ్యాన్స్ వీడియో చూసి ఆమెకు మెసేజ్ చాహల్ మెసేజ్ చేశాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కాగా ఇటీవల పెళ్లి రోజు సందర్భంగా చాహ‌ల్- ధ‌న‌శ్రీ దంపతులు ‘గ‌ల్ బ‌న్ గ‌యే' అనే పంజాబీ పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియోను ధ‌న‌శ్రీ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. మూడేళ్లుగా ప్రతి సంద‌ర్భంలో ఒకరికొకరం ఎంతో స‌పోర్ట్‌గా ఉంటున్నామని.. అవ‌కాశం వ‌చ్చిన ప్రతిసారి చాహ‌ల్‌తో ఈరోజు మాదిరిగానే డాన్స్ చేస్తానంటూ ధనశ్రీ పోస్ట్ చేసింది. చాహల్ కూడా తన ప్రియమైన భార్యపై తన ప్రేమను ప్రదర్శించాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు. తాము కలిసిన మొదటి రోజు నుండి ఈ క్షణం వరకు ఈ ప్రయాణంలో ప్రతి సెకను తన హృదయానికి ధనశ్రీ దగ్గరగా ఉందన్నాడు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని.. అలాగే తమ బంధాన్ని కూడా దేవుడే కలిపాడని భావిస్తున్నట్లు తెలిపాడు. తనను మంచి మనిషిగా తీర్చిదిద్దావని.. తనను పూర్తి మనిషి చేశావని ధనశ్రీతో చాహల్ అన్నాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 23 , 2023 | 04:39 PM