Share News

IND Vs AUS: గౌహతిలో మూడో టీ20.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2023-11-28T18:54:24+05:30 IST

T20 Cricket: టీమిండియా ఈరోజు గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే టీ20 సిరీస్‌తో పాటు ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగు మార్పులతో తాము బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.

IND Vs AUS: గౌహతిలో మూడో టీ20.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

వన్డే ప్రపంచకప్ ఫైనల్లో నిరాశపరిచిన టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అదరగొడుతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో భారీ స్కోర్లు చేసి విజయం సాధించిన టీమిండియా ఈరోజు గౌహతి వేదికగా మూడో టీ20లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే టీ20 సిరీస్‌తో పాటు ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగు మార్పులతో తాము బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు. స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, అబాట్, జంపా స్థానాలలో ట్రావిస్ హెడ్, అరోన్ హార్డీ, బెరన్ డార్ఫ్, కేన్ రిచర్డ్ సన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు వేడ్ వెల్లడించాడు. మరోవైపు టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. మ్యారేజ్ సందర్భంగా ముఖేష్ కుమార్ ఈ మ్యాచ్ ఆడటం లేదని.. అతడి స్థానంలో అవేష్ ఖాన్ తుది జట్టులోకి వచ్చినట్లు వివరించాడు.

ప్లేయింగ్ ఎలెవన్

టీమిండియా: సూర్యకుమార్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యషస్వీ జైశ్వాల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్

ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జాష్ ఇంగ్లీస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టాయినీస్, అరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, జాసన్ బెరన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్ సన్


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-28T18:54:38+05:30 IST