Share News

AUS Vs ENG: 49.3 ఓవర్లలో ఆస్ట్రేలియా ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ ఇదే..!!

ABN , First Publish Date - 2023-11-04T18:24:01+05:30 IST

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.

AUS Vs ENG: 49.3 ఓవర్లలో ఆస్ట్రేలియా ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ ఇదే..!!

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్‌పై రాణించిన ఓపెనర్లు ఈ మ్యాచ్‌లో మాత్రం 38 పరుగులకే పెవిలియన్ చేరారు. ట్రావిస్ హెడ్ (11), డేవిడ్ వార్నర్ (15) విఫలమయ్యారు. స్టీవ్ స్మిత్ (44), లబుషేన్ (71) కలిసి మూడో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. మ్యాక్స్‌వెల్ స్థానంలో జట్టులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్ 32 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 రన్స్ చేశాడు. చివర్లో ఆడమ్ జంపా నాలుగు ఫోర్ల సహాయంతో 29 రన్స్ చేయడంతో ఆస్ట్రేలియా మంచి స్కోరు చేసింది.

కాగా ఈ మెగా టోర్నీలో సెమీస్ ఆశలు నిలవాలంటే ఇంగ్లండ్‌కు ఇది ఆఖరి అవకాశం. ఇప్పటికే పాయింట్ల పట్టికలో బాగా వెనుకబడిన ఆ జట్టు ఆస్ట్రేలియాపై గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆ జట్టు ఇప్పటి వరకు పేలవ ప్రదర్శన చేసింది. బంగ్లాదేశ్‌పై మినహా మరో జట్టుపై గెలవలేకపోయింది. ఆరు మ్యాచ్‌లలో ఐదింట్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఒకవైపు వరుసగా ఓటమి పాలవుతున్నా ఇంగ్లండ్ మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.

Updated Date - 2023-11-04T18:24:02+05:30 IST