Share News

Team India: జైశ్వాల్, గిల్, అయ్యర్.. ఇది టెస్టు జట్టా? టీ20 జట్టా?

ABN , Publish Date - Dec 27 , 2023 | 02:38 PM

Team India: దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా పేలవంగా ప్రారంభించింది. దీనికి కారణం జట్టు ఎంపిక అనే చెప్పాలి. ఈ టెస్ట్ సిరీస్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 కింద నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రతి టెస్టులో విజయం సాధించడం చాలా ముఖ్యం. అయితే భారత్ టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన తీసికట్టుగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

Team India: జైశ్వాల్, గిల్, అయ్యర్.. ఇది టెస్టు జట్టా? టీ20 జట్టా?

దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది. టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత్.. వన్డే సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో గెలుచుకుంది. కానీ రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా పేలవంగా ప్రారంభించింది. దీనికి కారణం జట్టు ఎంపిక అనే చెప్పాలి. ఈ టెస్ట్ సిరీస్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 కింద నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రతి టెస్టులో విజయం సాధించడం చాలా ముఖ్యం. అయితే భారత్ టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన తీసికట్టుగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవని సందర్భంలో పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా గాయాలతో ఇబ్బంది పడుతున్న వేళ మంచి జట్టును ఎంపిక చేయకపోగా టీ20 జట్టుతో టెస్టులను ఆడిస్తుండటం ఆరోపణలకు తావిస్తోంది.

ఓపెనింగ్ స్థానాలకు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ వంటి సీనియర్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నా.. యషస్వీ జైశ్వాల్‌ను ఆడించడమేంటని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వన్‌డౌన్‌లో పుజారా వంటి ఆటగాడు ఉన్నా అతడిని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని సూచిస్తున్నారు. రహానెను పక్కనపెట్టినప్పుడు పుజారాను తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పుజారా స్థానంలో గిల్‌ను ఆడించాలన్న ఆలోచన ఉన్నప్పుడు ధనాధన్ క్రికెట్ ఆడే శ్రేయాస్ అయ్యర్ స్థానంలో నిఖార్సైన టెస్ట్ ఆటగాడిని ఎంచుకోవాల్సిందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి టీమిండియా మేనేజ్‌మెంట్ ఇప్పటికైనా పునరాలోచన చేసి వైట్ బాల్ యువ క్రికెటర్లకు రెడ్ బాల్ ఆటను అప్పగించడం మానుకోవాలని క్రికెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 02:38 PM