Share News

SA Vs AFG: సెంచరీ మిస్ చేసుకున్న ఒమర్‌జాయ్.. ఆప్ఘనిస్తాన్ ఫైటింగ్ స్కోరు

ABN , First Publish Date - 2023-11-10T18:28:30+05:30 IST

ODI World Cup 2023: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 116 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆప్ఘనిస్తాన్‌ను అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఆదుకున్నాడు. 107 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి చివరకు నాటౌట్‌గా మిగిలాడు.

SA Vs AFG: సెంచరీ మిస్ చేసుకున్న ఒమర్‌జాయ్.. ఆప్ఘనిస్తాన్ ఫైటింగ్ స్కోరు

వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో కూడా ఆప్ఘనిస్తాన్ రాణించింది. అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 116 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆప్ఘనిస్తాన్‌ను అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఆదుకున్నాడు. 107 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి చివరకు నాటౌట్‌గా మిగిలాడు. ఓవర్లు అయిపోవడంతో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మెగా టోర్నీలో నిలకడగా ఆడుతున్న రహ్మత్ షా (26), కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (2) ఈ మ్యాచ్‌లో విఫలం కావడం ఆఫ్ఘనిస్తాన్‌ను ‌కష్టాల్లో పడేసింది. దీంతో ఆ జట్టు ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. అయితే అజ్మతుల్లా్కు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ సహకారం అందించడంతో ఆప్ఘనిస్తాన్ 50 ఓవర్లు ఆడగలిగింది.

కాగా కీలక సెమీఫైనల్‌కు ముందు నామమాత్రపు మ్యాచ్ కావడంతో దక్షిణాఫ్రికా ఇద్దరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. ఆల్‌రౌండర్ మార్కో యాన్‌సన్ స్థానంలో ఫెలుక్వాయోను తుది జట్టులోకి తీసుకుంది. మరోవైపు షాంసీ స్థానంలో గెరాల్డ్ కోయిట్జెను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జె నాలుగు వికెట్లతో రాణించగా.. లుంగి ఎంగిడి 2 వికెట్లు, కేశవ్ మహరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. ఫెలుక్వాయో ఒక వికెట్ సాధించాడు. ఈ మ్యచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచినా.. ఓడినా పాయింట్ల పట్టికలో తేడా ఏమీ రాదు. ఇప్పటికే ఆ జట్టు సెమీస్ బెర్తు కైవసం చేసుకుని ఈనెల 16న అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఆప్ఘనిస్తాన్ గెలిస్తే పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుతుంది. భారీ తేడాతో గెలిచినా ఆ జట్టుకు మాత్రం సెమీస్ అవకాశాలు లేవు. నెట్ రన్‌రేట్ మైనస్‌లలో ఉండటంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలకు దూరమైంది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-10T18:28:31+05:30 IST