Imran Khan: విరాట్ కోహ్లీ- పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-14T21:48:31+05:30 IST

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)- పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజంపై (Babar Azam) పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Imran Khan: విరాట్ కోహ్లీ- పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)- పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజంపై (Babar Azam) పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్- బాబర్ ఇద్దరు బ్యాటర్ల మధ్య పోటీ గురించి ఇమ్రాన్ మాట్లాడుతూ విరాట్ రికార్డులను అధిగమించగల సామర్థ్యం బాబర్‌కు ఉందని పేర్కొన్నాడు.

అక్టోబర్‌లో ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ- బాబర్‌ మ్యాచ్‌ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. కోహ్లీ బ్యాటింగ్ తరచుగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పోల్చవచ్చని, అతను ప్రపంచంలోని అత్యంత ప్రతిభ గల బ్యాటర్లలో ఒకడుగా కూడా ఎదుగుతున్నాడని ఇమ్రాన్ అన్నాడు. తాను ఇటీవల క్రికెట్ చూడలేదని, కానీ విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఒకే తరహా బ్యాటింగ్ శైలికి చెందినవారని తాను నమ్ముతున్నానని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.

Updated Date - 2023-06-14T21:49:23+05:30 IST