IndiaVsAustralia: సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. ఏం ఎంచుకుందంటే..

ABN , First Publish Date - 2023-03-22T13:46:16+05:30 IST

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IndiaVsAustralia) 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ పడింది...

IndiaVsAustralia: సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. ఏం ఎంచుకుందంటే..

చెన్నై: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IndiaVsAustralia) 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ పడింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అతిథ్య భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. కాగా ఈ వన్డే సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరగగా 1-1 ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గెలుపొందిన జట్టే వన్డే సిరీస్‌ను ఎగరేసుకుపోనుంది. కాగా టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

తుది జట్లు:

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, లబుషేన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినీస్, అగర్, సీన్ అబ్బాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

Updated Date - 2023-03-22T13:46:37+05:30 IST